Begin typing your search above and press return to search.
మోడీ మంచోడే కానీ అమిత్ షా నే .. ?
By: Tupaki Desk | 14 Nov 2019 2:30 PM GMTప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర రాజకీయం గురించి చర్చలు నడుస్తున్నాయి. పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగి .. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక ..ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకొని .. నాలుగు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ..రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా చేసారు. ఒకరకంగా ఇది ప్రజా తీర్పుని అవహేళన చేసినట్టే ... పదవులకోసం విమర్శలకి దిగి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల , ప్రజా పరిపాలన గురించి మరచిపోయారు.
అసలు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడటానికి ప్రధాన కారణం బీజేపీ , శివసేన. ఎన్నికల ముందు పొత్తుతో పోటీ చేసి ..ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం మాకు అంటే ..మాకు అంటూ ఈ వివాదానికి తెర తీశారు. ఎవరైనా పొత్తులతో బరిలోకి దిగితే ,,ముందే ఒక నిర్దిష్టమైన ఒప్పందం చేసుకోవాలి కానీ , ఇలా ప్రజా తీర్పు ఇచ్చిన తరువాత పదవులకోసం కొట్టుకుంటే దాన్ని రాజకీయం అని అనరు. ఈ పరిస్థితికి కారణం మీరే అంటే మీరే అని శివసేన , బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ విషయం పై స్పందించిన అమిత్ షా .. ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ, అమిత్ షా తమ సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పారు. ఆ విషయాన్ని బుధవారం అమిత్ షా మీడియాకు తెలిపారు. అసలు అప్పుడు 50 -50 ఫార్ములా చర్చకు రాలేదని తెలియజేసాడు. అమిత్ షా చేసిన ఈ కామెంట్స్ పై స్పందించిన.. శివసేన నేత సంజయ్ రౌత్. ఈ వివాదానికి ప్రధాన కారణం అమిత్ షా నే అని అన్నారు. ఉద్దవ్ థాకరే వద్ద ఒప్పందానికి షా అంగీకరించి.. ఆ మాటను మోడీ వద్ద దాచిపెట్టారని విమర్శించారు. దీంతో ఎన్నికల తర్వాత సీఎం సీటు వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగిందని గుర్తుచేశారు.
మోడీ, అమిత్ షా లు తమ సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ అని చెబితే.. ఉద్దవ్ థాకరే కూడా శివసేన నుంచి సీఎం అభ్యర్థి అని పలు వేదికలపై చెప్పిన విషయాన్ని తో చెప్పారు. ఉద్దవ్ అలా చెబుతుంటే అమిత్ షా అప్పుడు ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. శివసేన పార్టీ ప్రధాని మోడీని గౌరవిస్తుందని సంజయ్ రౌత్ చెప్పారు. కానీ ఉద్దవ్‌తో జరిగిన సమావేశ వివరాలను తెలియజేయడంలో అమిత్ షా విఫలమయ్యారని తప్పుపట్టారు. రాజకీయాల్లో శివసేన ఎప్పుడూ లాభనష్టాలను బేరీజు వేసుకోదని సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడదని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాలిస్తోందని చెప్పారు. ఆత్మభిమానాన్ని చంపుకోదని.. ఉన్నది ఉన్నట్టు స్పష్టం చేస్తుందని తెలిపారు. అమిత్ షా వైఖరి మార్చుకోవాలని తెలిపారు.