Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ - ఎన్సీపీ - సేన‌..ప‌ద‌వుల పంప‌కం ఇలా!

By:  Tupaki Desk   |   30 Dec 2019 9:27 AM GMT
కాంగ్రెస్ - ఎన్సీపీ - సేన‌..ప‌ద‌వుల పంప‌కం ఇలా!
X
ఎట్ట‌కేల‌కే మ‌హారాష్ట్ర‌లో కొత్త కేబినెట్ ఏర్ప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత అక్క‌డ ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయో అంద‌రికీ తెలిసిందే. బీజేపీ-సేన‌లు క‌లిసి పోటీ చేయ‌డం - సీఎం సీటు విష‌యంలో ప్ర‌తిష్ట‌కు పోయి రెండు పార్టీలూ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ముందుకు రాక‌పోవ‌డం - ఆ త‌ర్వాత నాట‌కీయ ప‌రిస్థితుల్లో ఫ‌డ్న‌వీస్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం, ఆ ప్ర‌భుత్వం గంట‌ల్లోనే కూలిపోవ‌డం, ఆ త‌ర్వాత కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం నెల‌కింద‌టి సంగ‌తులు.

ఇప్పుడు ఎట్ట‌కేల‌కూ ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న కేబినెట్ ను నియ‌మించుకున్నాడు. నెల రోజుల త‌ర్వాత కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం జ‌రిగింది. త‌న త‌న‌యుడు ఆదిత్య‌ను మంత్రిగా నియ‌మించుకోవ‌డం - ఎన్సీపీకి తిరుగుబాటు చేసిన అజిత్ ప‌వార్ కు మ‌ళ్లీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఈ మంత్రివ‌ర్గ ఏర్పాటులో ముఖ్య విశేషాలు.

వారి పేర్లు ఉద‌యం నుంచి వినిపించాయి.. మ‌ధ్యాహ్నానికి వారి విష‌యంలోని ఊహాగానాలు నిజం అయ్యాయి. ఇక ఈ కేబినెట్ ఏర్పాటుకు నెల రోజుల నుంచి మూడు పార్టీలూ క‌స‌ర‌త్తు చేశాయి. ఎవ‌రికి ఏ ప‌ద‌వులు కావాల‌నే విష‌యంలో డిమాండ్లుకు అనుగుణంగా మూడు పార్టీలూ ఆచితూచి లెక్క‌లేశాయి. మంత్రిత్వ శాఖ‌లు - వాటికి ఉన్న ప‌వ‌ర్ కు అనుగుణంగా మూడు పార్టీలూ చాలా లెక్క‌లు వేసుకున్నాయి. చివ‌ర‌కు ఒక ఒప్పందానికి వ‌చ్చాయి. ఆ ఒప్పందాలు మంత్రివ‌ర్గ ఏర్పాటుతో క్లారిటీకి వ‌చ్చాయి.

ముఖ్య‌మంత్రి ప‌ద‌విని సొంతం చేసుకున్న శివ‌సేన మంత్రి ప‌ద‌వుల విష‌యంలో వెన‌క్కు త‌గ్గింది. ఆరు కేబినెట్ ర్యాంకులు - మూడు స‌హాయ ర్యాంకులు శివ‌సేన‌కు ద‌క్కాయి. కూట‌మిలో చిన్న పార్టీ అయిన కాంగ్రెస్ కు ఎనిమిది క్యాబినెట్ ర్యాంకులు రెండు స‌హాయ ర్యాంకు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇక ఎన్సీపీకి ప‌ది కేబినెట్ ర్యాంకులు, నాలుగు స‌హాయ మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. వీటిలోనే ఒక డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఉంది. వీటితో పాటు ప్ర‌భుత్వంలో చేరిన చిన్న పార్టీ ఒక కేబినెట్ బెర్త్ ఇచ్చారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒక‌రికి స‌హాయ మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.