Begin typing your search above and press return to search.

మోడీని లేపేస్తే చాలు..దేశంలో పౌర‌యుద్ధ‌మే

By:  Tupaki Desk   |   28 Sep 2018 6:34 PM GMT
మోడీని లేపేస్తే చాలు..దేశంలో పౌర‌యుద్ధ‌మే
X
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హ‌త్య ఉదంతం విష‌యంలో తాజాగా ఆయ‌న పౌర‌యుద్ధం ప్ర‌స్తావ‌న తెచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎలాగైతే రూపుమాపామో, అదే తరహాలో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని మావోలు లేఖలు రాసుకున్నారని పేర్కొంటూ అందుకు కొంద‌రు స‌హ‌క‌రించార‌నే వార్త వెలుగులోకి రావ‌డం, ప‌లువురిని అరెస్ట్ చేయ‌డం తెలిసిన సంగ‌తే. దీనిపై తాజాగా మ‌హారాష్ట్ర సీఎం స్పందిస్తూ...నక్సల్స్‌ ను వాడుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీని చంపేందుకు పౌరహక్కుల నేతలు ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు.

పౌరహక్కుల నేతలు వరవరరావుతో పాటు అరుణ్ ఫెరీరా - వెర్నాన్ గోన్సాల్స్ - సుధా భరద్వాజ్ - గౌతమ్ నవలక్‌ ల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరో నాలుగు వారాలు పెంచింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సీఎం ఫడ్నవీస్ స్పందించారు. పౌరహక్కుల నేతలు దేశంలో పౌరయుద్ధానికి తెరలేపేందుకు ప్రయత్నం చేశారన్నారు. వీరి అరెస్టు అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది పూణె పోలీసులు అదేవిధంగా దేశం మొత్తానికి చెందిన గొప్ప విజయమన్నారు. వీరు ఎన్నోయేళ్లుగా దేశంలో పౌరయుద్ధానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.