Begin typing your search above and press return to search.

అద్దె అడగొద్దు - గవర్నమెంటు ఆర్డర్

By:  Tupaki Desk   |   17 April 2020 3:47 PM GMT
అద్దె అడగొద్దు - గవర్నమెంటు ఆర్డర్
X
అవునా? మన తెలుగు రాష్ట్రాల్లోనేనా అని సంబరపడకండి. ఇది మహా రాష్ట్ర వార్త. మూడు నెలలు ఇంటి యజమానులు అద్దె అడగవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఆదాయం కోల్పోయిన దిగువ మధ్యతరగతి - పేదలను ఉద్దేశించి ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ ఆదేశాలకు నిబద్ధత ఎంత అన్నది తెలియడం లేదు. ఇది న్యాయ వ్యవస్థ ఆమోదిస్తుందా లేదా అన్నది తెలియడం లేదు. ఎందుకంటే ప్రపంచానికి ఇది కొత్త పరిణామం.

అయితే... మహా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్లో స్పష్టత లోపించింది. మూడు నెలలు రెంటు అడగవద్దన్నారు. కానీ వాటిని మళ్లీ వసూలు చేసుకోవాలా వద్దా? అన్నది క్లారిటీ ఇవ్వలేదు. అసలు గవర్నమెంటుకు ఈ రైట్ ఎక్కడిది ప్రైవేటు ఆస్తుల మీద అన్నది మరో ప్రశ్న. మరి అద్దెలే ఆదాయంగా బతికే వారి పరిస్థితి ఏంటి? మరి రెంటు తీసుకోకుంటే వారు ఏం చేయాలి? ఇలాంటివేవీ ఆదేశాల్లో క్లియర్ గా లేదు.

ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు. అయితే, కేజ్రీవాల్ ఇళ్ల యజమానులను రిక్వెస్ట్ చేశారు. ఒకవేళ వారు అద్దె కట్టలేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అన్నారు. అంతేకాదు. వారు కొంచెం మెరుగయ్యాక వసూలు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మహారాష్ట్ర ఆదేశాల్లో ఈ క్లారిటీ లోపించింది.