Begin typing your search above and press return to search.

మరాఠీల కోసం సర్కారు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   29 Nov 2018 11:29 AM GMT
మరాఠీల కోసం సర్కారు కీలక నిర్ణయం
X
మొదటి నుంచి స్వాభిమానంతో ముందుకెళ్తున్న బీజేపీ సర్కారు మహారాష్ట్రలో మరోసారి వివాదాస్పద బిల్లును పాస్ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో తాజాగా మరాఠీలకు విద్యా ఉద్యోగావకాశాల్లో 16శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు.. అధికార, పక్షాలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలిపి పాస్ చేశాయి. సహకరించిన విపక్షాలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే మరాఠీలకు విద్యాసంస్థల్లో అడ్మిషన్లు - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 16శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అంతకుముందు రిజర్వేషన్లపై వెనుకబడిన తరగతుల కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఫడ్నవీస్ సభ ముందు ఉంచారు.

ఈ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) - ఆర్టికల్ 16(4) ప్రకారం మరాఠీలు రిజర్వేషన్లకు అర్హులు అవుతారని రిపోర్ట్ లో వెల్లడించింది. రాజ్యాంగాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకోవాలని కమిషన్ సూచించింది.

కాగా మహారాష్ట్రలో దాదాపు 30శాతం మంది మరాఠీలున్నారు. వీరు కొద్దికాలంగా తమ విద్యా ఉద్యోగావకాశాలు వేరే రాష్ట్రం వాళ్లు, ఇతర కులస్థులు కొల్లగొడుతున్నారని ఉద్యమం చేస్తున్నారు. ఈఏడాది ఆగస్టు , జూలై నెలల్లో నిరసనలు పెల్లుబుకాయి. దీంతో ప్రభుత్వం కమిషన్ వేసి తాజాగా నివేదిక ప్రకారం బిల్లును ఆమోదించింది.