Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా .. ఆ కేసే కారణమా ?

By:  Tupaki Desk   |   5 April 2021 11:23 AM GMT
బ్రేకింగ్ : మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా .. ఆ కేసే కారణమా ?
X
ప్రముఖ బిసినెస్ మెన్ ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కొద్ది సేపటి క్రితమే సీఎం ఉద్ధవ్ ‌ఠాక్రే కు పంపించారు. ఈ మద్యే ఆయనపై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అనిల్ దేశ్‌ ముఖ్ ‌పై ముంబై మాజీ క‌మిష‌న‌ర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై అమేరకు ప్రాథమిక విచారణ కోసం కేసును సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే , 15 రోజుల్లో ఈ విచార‌ణ పూర్తి చేయాల‌ని కోర్టు తెలిపింది.

ఈ విచారణలో ఆధారాలు లభ్యమైతే ఎఫ్ ఐ ఆర్ నమోదుచేయాలని సూచించింది. విచారణ కోసం నియమించిన అధికారులకు అన్ని పార్టీల సహకరించాలని పేర్కొంది. బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు హోంమంత్రి నిర్ధేశించారని పరమ్ ‌బీర్‌ సింగ్‌ ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పోలీస్ కమిషనర్ చేసిన ఈ ఆరోపణలు మహారాష్ట్ర ప్రభుత్వంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హోంమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

అదే సమయంలో హోంమంత్రి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పరమ్‌బీర్‌ తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై తొలుత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. సుప్రీం సూచన మేరకు పరమ్‌బీర్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జయశ్రీ పాటిల్ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పరంబీర్ సింగ్ పిటిషన్‌ పై మార్చి 30న విచారణ పూర్తిచేసిన బాంబే హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, నిర్ణయాన్ని వెలువరించింది. అయితే, విచారణ సందర్భంగా పోలీస్ అధికారి పరమ్ ‌బీర్ సింగ్ ‌‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిపై ఆరోపణల విషయంలో ఎఫ్ ఐ ఆర్ ఎందుకు నమోదుచేయలేదని పదే పదే నిలదీసింది. మీరు పోలీసు కమిషనర్, మీ కోసం చట్టాన్ని ప్రత్యేకంగా ఎందుకు కేటాయించాలి, పోలీస్ అధికారులు, మంత్రులు, రాజకీయ నేతలు చట్టానికి అతీతులా, అంటే మీరు చట్టాలకు అతీతులమని భావిస్తున్నారా అంటూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే దత్ వ్యాఖ్యానించారు. అనిల్ దేశ్ ముఖ్, మీరు హోంమంత్రి కింద మహారాష్ట్ర పోలీసులు ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో విచారణను సరిగ్గా నిర్వహించలేరు. దీంతో, కోర్టు సీబీఐకి ప్రాథమిక విచారణ ఇచ్చిందని న్యాయవాది జైశ్రీ పాటిల్ తెలిపారు. దీనితో హకోర్టు ధర్మాసనం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.