Begin typing your search above and press return to search.
మ్యాగీకి మళ్లీ మూడిందా?
By: Tupaki Desk | 13 Nov 2015 1:28 PM GMTమ్యాగీకి వరుసబెట్టి బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. మార్కెట్ లోకి ప్రవేశించి వారం రోజులైనా గడవకముందే మ్యాగీ నూడుల్స్ కి మళ్లీ కష్టాలు మొదలవుతున్నాయి. దేశంలో ఆన్ లైన్ మ్యాగీ విక్రయాలు మొదలవగా....ఐదు నిముషాల వ్యవధిలోనే దాదాపు 60వేల వెల్ కమ్ మ్యాగీ కిట్లు అమ్ముడై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్పత్తికి ఇంత క్రేజ్ ఉంటే.... ఆంక్షల రగడ ఇంకా కొనసాగుతోంది.
ఇటీవలే పలు ల్యాబ్ లలో పరీక్షల అనంతరం నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్ సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేసి ఎంట్రీ అదిరింది అనిపించుకుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం మ్యాగీ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. బాంబే హైకోర్టు మ్యాగీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగి ఉన్న మహారాష్ర్టలో ఈ రకంగా ఒత్తిడి పడటం మ్యాగీ అమ్మకాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.