Begin typing your search above and press return to search.
రోడ్డు మీద ఆగిన ట్రక్కును నడిపిన మంత్రి
By: Tupaki Desk | 30 April 2017 8:32 AM GMTభారీ ట్రక్కు. అందులో డ్రైవర్. అంతా ఓకే అనుకుంటున్నారా? అస్సలు నాట్ ఓకే. ఎందుకంటే.. సదరు ట్రక్కు డ్రైవర్ ఫుల్లుగా డ్రింక్ వేశాడు. రద్దీ ఉన్న రోడ్డు మీదకు మృత్యుశకటం లాంటి ట్రక్కును తీసుకొచ్చాడు. ఇలాంటప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? భారీ యాక్సిడెంట్ చోటు చేసుకొని పలువురు మృత్యువాత పడుతుంటారు. కానీ.. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. సకాలంలో ఒక మంత్రి చొరవతో ఊహించని సీన్ కొటి చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని జల్ గావ్ ప్రాంతంలో ఆ రాష్ట్ర మంత్రి గిరీశ్ మహజన్ కారులో వెళుతున్నారు. ఆయన వెళుతున్న మార్గమధ్యంలో ఒక ట్రక్కు ఆగి.. భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో.. కారు దిగిన మంత్రి.. ట్రక్కు డ్రైవర్ ఫుల్ గా తాగేసిన వైనాన్ని చూసి.. డ్రైవర్ ను కిందకు దించేశారు. ఆపై తానే ట్రక్కును నడిపి.. రోడ్డు పక్కకు తీసుకెళ్లి నిలిపారు.దీంతో.. అక్కడ ట్రాఫిక్ జాం క్లియర్ కావటమే కాదు.. అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రిగారు స్వయంగా రంగంలోకి దిగి.. ట్రక్కు డ్రైవ్ చేసి.. పక్కకు తీసిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు మంత్రిని అభినందిస్తున్నారు. తన దారిన తాను పోకుండా.. ప్రజల కోసం ఏకంగా ట్రక్కు నడిపిన తీరుపై మంత్రిని అభినందిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/