Begin typing your search above and press return to search.

మంత్రికి కరోనా !

By:  Tupaki Desk   |   24 April 2020 2:41 AM GMT
మంత్రికి కరోనా !
X
విదేశాల్లో ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడటం చూశాం. కానీ మనదేశంలో అదృష్టవశాత్తూనో ఇంకే కారణం వల్లో లీడర్లందరూ క్షేమంగా ఉన్నారు ఇన్ని రోజులు. అయితే, తాజాగా ఒక మహారాష్ట్రకు చెందిన మంత్రికి కరోనా సోకింది. దీంతో తొలిసారి ఒక లీడర్ కి మనదేశంలో కరోనా సోకినట్లు అయ్యింది. కరోనా బారిన పడిన మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్సీపీ నేత జితేంద్ర అహ్వాద్. ఈయన వయసు 54 సంవత్సరాలు. థానే నగరంలోని ముంబ్రా - కాల్వా నియోజకవర్గం నుంచి జితేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఆయన భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో ఆయన క్వారంటైన్లోకి వెళ్లారు. ఆ సందర్భంలో ఆయనకు టెస్టులు చేయగా నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఆయన క్వారంటైన్ లో ఉండిపోయారు. అనంతరం కొన్ని లక్షణాలు డెవలప్ కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 13న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ తాజా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో మహారాష్ట్రలో ఆందోళన మరింత పెరిగింది.

ఇప్పటికే మహారాష్టలో దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 24 గంటల్లోనే 778 కొత్త కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6427కు చేరింది. ఇప్పటివరకు 283 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్కరోజే 14 మంది కరోనాతో చనిపోయారు. రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. ఇప్పటివరకు 840 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి చూస్తుంటే... మహారాష్ట్రలో మూడో దశ విజృంభణ మొదలైనట్టు అనిపిస్తోంది.