Begin typing your search above and press return to search.

ఆ సీఎం టెన్షన్ తీరి.. హమ్మయ్య అనుకుంటున్నారట

By:  Tupaki Desk   |   15 May 2020 3:30 AM GMT
ఆ సీఎం టెన్షన్ తీరి.. హమ్మయ్య అనుకుంటున్నారట
X
రజల మాట ఎలా ఉన్నా.. పదవి పోతుంటే అధినేతలు ఎంతలా ఉక్కిరిబిక్కిరి అవుతారన్న దానికి నిదర్శనంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అనూహ్యంగా మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చున్న ఆయనకు వచ్చి పడుతున్న చిక్కులు అన్ని ఇన్ని కావు. అధికారాన్ని చేతిలోకి తీసుకొని.. కాస్త కుదురుకునే సరికే మాయదారి రోగం విరుచుకుపడటం.. దేశంలో అత్యధిక మరణాలు.. కేసులున్న రాష్ట్రమన్న అపప్రధను మూటగట్టుకుంది.

ఇదిలా ఉండగానే.. నిబంధనల ప్రకారం ఏదైనా చట్టసభకు తాను ఎన్నిక కావాల్సిన సమయం ముగిసే వేళ.. ముఖ్యమంత్రి పదవికి ముప్పుగా మారే పరిస్థితి. ఇలాంటివేళ.. భేషజాల్ని పక్కన పెట్టి ప్రధాని మోడీకి ఫోన్ చేయటం తెలిసిందే. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా జోక్యం చేసుకోవాలని కోరటం.. అందుకు మోడీ మాష్టారు ఓకే చెప్పటంతో మహారాష్ట్రలో అనవసరమైన ట్విస్టులకు అవకాశం లేకుండా పోయింది.

అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఎట్టకేలకు.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తైంది. తాజాగా ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మహారాష్ట్ర శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిబంధనల ప్రకారం ఈ నెల 27లోపు ఏదో ఒక సభకు ఉద్ధవ్ ఎన్నిక కావాల్సి ఉంది. అ గడువుకు రెండు వారాల ముందే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

రూల్స్ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎట్టి పరిస్థితుల్లో పదవిని చేపట్టిన ఆర్నెల్ల కాలంలో ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. తొమ్మిది స్థానాలున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. సాంకేతిక కారణాలతో ఐదు నామినేషన్లు చెల్లలేదు.
దీంతో.. తొమ్మిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాలతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే టెన్షన్ తీరి.. హమ్మయ్య అనుకునే పరిస్థితి. అధినేతలు తమ పీఠాల్ని కాపాడుకోవాలనుకున్న వేళ.. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగి పోతుంటాయి. ప్రజల ఆరోగ్యం విషయంలో అలాంటి చర్యలు ఎందుకు ఉండవంటారు?