Begin typing your search above and press return to search.
మజ్లిస్‌తో కేంద్రం దోస్తీ..సంచలనానికి రెడీ
By: Tupaki Desk | 5 Dec 2018 4:28 AM GMTమహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలి కాలంలో తమ రాష్ట్రంలోని అంశాలనే ప్రస్తావిస్తున్న ఆయన తాజాగా జాతీయ అంశాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏకంగా సంచలనం సృష్టించే ఆరోపణలు చేశారు. సోమవారం రాత్రి ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన రాజ్ థాక్రే మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహాయంతో రామమందిరం అంశంపై మతకల్లోలాలు సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఈ మేరకు తనకు పక్కా సమాచారం ఉందని థాక్రే చెప్పడం గమనార్హం.
బహిరంగ సభలో థాక్రే మాట్లాడుతూ ``ఢిల్లీ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. రామమందిరం అంశంపై కేంద్ర ప్రభుత్వం అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దీనికి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. నాలుగున్నరేండ్లలో తాము ఏంచేశామో చూపించుకోవడానికి కేంద్రం వద్ద ఏమీలేదు. మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టడం తప్ప వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నేను మద్దతు పలుకుతాను. కానీ దానిని రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే నిర్మించాలని నేను డిమాండ్ చేయడం లేదు అని రాజ్‌థాక్రే తెలిపారు. ఢిల్లీ నుంచి ఫోన్ చేసింది ఎవరు అన్న విషయాన్ని రాజ్‌థాక్రే వెల్లడించలేదు.