Begin typing your search above and press return to search.
తప్పిపోయిన జై కోసం మహా పూజలు!
By: Tupaki Desk | 27 July 2016 7:58 AM GMTమనిషికీ పెంపుడు జంతువులకీ ఒక ప్రత్యేకమైన అనుబందం ఉంది. తనకు ఏమాత్రం హాని చేయలేని - అనువుగా ఉండే జంతువులైన కుక్కను - పిల్లి ప్రేమగా పెంచుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో విదేశాల్లో పందిపిల్లలను కూడా బాగానే పెంచుకుంటున్నారు. ఆయా పెంపుడు జంతువులకు చిన్న ఆపద వచ్చినా విలవిల్లాడిపోతాడు వాటి యజమాని. ఇంకా గట్టిగా మాట్లాడితే... సొంతపిల్లల కంటే పెంపుడు జంతువులను ఎక్కువగా ప్రేమించేవారు కూడా ఈమధ్యకాలంలో తారసపడుతున్నారు! తాజాగా ఒక ఊరిప్రజలు తప్పి పోయిన ఆత్మీయ జంతువు కోసం పూజలు చేస్తున్నారు. ఆ జంతువు కూడా ఏ పిల్లో - కుక్కో కాదు.. పులి!
విషయానికొస్తే.. మహారాష్ట్రలోని కర్హాండ్ల అభయారణ్యం దగ్గర ఉమ్రేద్ హైవేపై దర్జాగా తిరుగుతున్న ఒక పులిని ఆ ప్రాంత ప్రజలు ముద్దుగా జై అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. అదేంటి పులిని చూస్తే ఆమడదూరం పరుగెట్టిపోవాలి కదా అంటారా. ఆ పులి అన్ని పులులులాంటిది కాదట - మనుషులను చూసినా కూడా ఏమీ చేసేది కాదట. దీంతో స్థానిక ప్రజలంతా ఈ పులికి జై అని ముద్దుపేరు పెట్టుకుని మరీ చూసుకుంటున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఒక మూడు నెలల నుండి ఆ పులి కనిపించడం మానేసిందట. దీంతో ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయిన జనాలు.. భారం దేవుడిపై వేసి పూజలందుకున్నారు.
పూజలతో సరిపెట్టి భారం మొత్తం దేవుడిపై వేస్తే బాగోదని భావించి.. సుమారు వందమందికి పైగా వాలంటీర్లు తప్పిపోయిన ఆ జై కోసం తెగ గాలిస్తున్నారు. వారిపూజలు - వాలంటరీ పనులు ఫలించి వారికి పులిబాబు దొరకాలని మనమూ కోరుకుందాం. ఇంతకూ ఆ పులికి జై అనే పేరే ఎందుకు పెట్టారో తెలుసా? బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సోలే సినిమాలో అమితాబ్ పాత్ర పేరు అది!