Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: మహా మలుపు తిరిగిన ‘‘మహా’’ రాజకీయం
By: Tupaki Desk | 9 Nov 2019 2:55 PM GMTగడిచిన కొద్ది రోజులుగా సా..గుతున్న మహారాష్ట్ర రాజకీయం మహా మలుపు తిరిగింది. కొద్ది రోజులుగా మలుపులకు చెక్ చెబుతూ.. అనూహ్యంగా మహారాష్ట్ర గవర్నర్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపు వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగవత్ సింగ్ కోషియారి నుంచి ఫడ్నవీస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 105 స్థానాల్ని సొంతం చేసుకొని అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ లేదు.
తన మిత్రపక్షమైన శివసే సీఎం పీఠాన్ని కోరటం.. అందుకు బీజేపీ సిద్ధంగా లేని నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్ర రాజ్ భవన్ నుంచి ఫడ్నవీస్ ను ఈ నెల 11 లోపు ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలన్నారు.
ఇదిలా ఉంటే.. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఫడ్నవీస్ చెబుతున్నారు. అయితే.. శివసేన మాత్రం ప్రభుత్వంలో బీజేపీతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా లేదు. ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీకే చెందాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ పిలుపుపై శివసేన ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.