Begin typing your search above and press return to search.
పరేషాన్ లో మహారాజకీయం.. కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందా !
By: Tupaki Desk | 30 Oct 2019 4:58 AM GMTతాజాగా జరిగిన ఎన్నికలలో మహారాష్ లో శివసేన - బీజేపీ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. 288 స్థానాలకు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలిచింది. దీనితో అందరూ మిత్రపక్షాలైన బీజేపీ , శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమే అని అనుకున్నారు. కానీ , ముఖ్యమంత్రి పీఠం విషయంలో బీజేపీ , శివసేన మధ్య కీచులాట మొదలై ..మద్దతు ఉపసంహరించుకునే స్థాయికి చేరింది.
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుండి శివసేన 50 -50 పార్ములా కింద ముఖ్యమంత్రి పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందే అని పట్టుబడుతోంది. బీజేపీ మాత్రం దానికి ససేమిరా అనడం తో ఇద్దరి మధ్య కుమ్ములాటలు మొదలైయ్యాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేనే మరో ఐదేళ్లు సీఎంగా ఉండబోతున్న అని ప్రకటించడంతో శివసేన మరింత మండిపడుతుంది. నేను అమిత్ షాతో మాట్లాడాను. అధికారం చెరిసగం కాలం పంచుకోవడానికి తానెలాంటి హామీ ఇవ్వలేదని ఆయన స్పష్టంగా చెప్పారు అని సీఎం తెలియజేసారు.
ఆదిత్య ఠాక్రేను డిప్యూటీ సీఎం చేస్తారా అని ప్రశ్నించగా.. సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు, కానీ సరైన సమాధానం మాత్రం చెప్పలేదు. ఫడణవీస్ వ్యాఖ్యలతో స్పందించిన శివసేన జర యాద్ కరో జబానీ(హామీ గుర్తుకు తెచ్చుకోండి) శీర్షికన ఓ పాత వీడియో క్లిప్పింగ్‌ను ఆయనకు పంపింది. అది ఈ ఏడాది ఫిబ్రవరి 18 నాటిది. అధికారంలోకి వచ్చాక పదవులు, బాధ్యతలు చెరిసగం పంచుకుందామని ఫడణవీస్ అందులో వ్యా ఖ్యానించినట్లు ఉంది. ఈ విషయాన్ని ఆయన కెమెరా ఎదుట స్పష్టంగా అన్నారు. మరిప్పుడు అనలేదంటే.. నిజానికి వేరే నిర్వచనం ఇవ్వాలేమో అని సేన నేత సంజయ్ రౌత్ చెప్పారు.
చెరి సగం అన్నది అధికారం విషయంలోనే తప్ప సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవడం కాదు అని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ తమకి అనుగుణంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. శివసేన నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకొస్తే పరిశీలించడానికి సిద్ధం. మా అధినాయకత్వంతోనూ, మిత్రపక్షమైన ఎన్సీపీతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ఇప్పటికే ప్రకటించారు. అలాగే శివసేన నేతలు కూడా బీజేపీ సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రత్యామ్న్యాయం చూసుకోకతప్పదు అని ఇప్పటికే ప్రకటించింది.