Begin typing your search above and press return to search.
అందంగా లేకపోవడమే వరకట్నానికి కారణం
By: Tupaki Desk | 3 Feb 2017 11:16 AM GMTమన సమాజంలో వరకట్నం దురాచారం అనేది తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ దురాచారం పెరిగిపోవడానికి మహారాష్ట్ర విద్యాశాఖ కొత్త నిర్వచనం ఇచ్చింది. యువతి అందంగా లేకపోయినా - శారీరక లోపాలు ఉన్నా ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుందని అధికారికంగా తెలిపిందే. ఈ మేరకు 12వ తరగతి(ఇంటర్) పాఠ్యపుస్తకంలో పేర్కొంది. సోషియాలజీ పుస్తకంలోని మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనే పాఠంలో ఈ మేరకు ఘనత వహించిన అధికారులు పొందుపరిచారు. అయితే ఈ పాఠ్యాంశం - అందులో పేర్కొన్న అంశాలు రచ్చరచ్చగా మారడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
వరుడి తరఫువాళ్లు కట్నం డిమాండ్ చేయడానికి గల కారణాల్లో మతం - కులం - సాంఘిక స్థోమతతోపాటు అందం కూడా ఒక కారణమని వివరించారు. ఒక వేళ యువతి అందంగా లేకపోయినా - శారీరక లోపాలు ఉన్నా పెళ్లి కావడం చాలా కష్టం. అలాంటివారిని వివాహం చేసుకోవడానికి వరుడి కుటుంబం వాళ్లు ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తారు. విధిలేని పరిస్థితుల్లో యువతుల తల్లిదండ్రులు వారి డిమాండ్లకు తలొగ్గుతారు. దీంతో వరకట్న వ్యవస్థ కొనసాగుతూనే ఉంది అని సిలబస్ లో భాగంగా ఉన్న పుస్తకంలో పొందుపరిచారు. అయితే ఈ పాఠ్యాంశం వివాదంగా మారడం - పలు సంఘాలు తీవ్ర నిరసన తెలిపిన నేపథ్యంలో మహారాష్ట్ర విద్యాశాఖ స్పందించింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని తెలిపారు. అయినప్పటికీ పలువురు మనోభావాలు దెబ్బతినేలా ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని వివాదంపై సభ్యులతో చర్చిస్తానని, వ్యాసాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/