Begin typing your search above and press return to search.

ఒకవైపు 5జీ.. మరోవైపు మొబైల్ ఫోన్లపై బ్యాన్..!

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:30 AM GMT
ఒకవైపు 5జీ.. మరోవైపు మొబైల్ ఫోన్లపై బ్యాన్..!
X
దేశంలో మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉందేమో గానీ.. సెల్ ఫోన్ లేని కుటుంబం లేదని అప్పట్లో ఒక సెటైర్ బాగా వైరల్ అయింది. అయితే వాస్తవం కూడా ఇందుకు చాలా దగ్గర ఉందనే మాటను ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిందే. ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు లేరనే చెప్పవచ్చు.

రోజురోజుకు పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని సెల్ ఫోన్ కంపెనీలు 5జీ టెక్నాలజీ (మొబైల్స్) ను కూడా తీసుకొస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే ముంబాయి.. బెంగూళూరు.. చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ సేవలు అన్ని నగరాలకు విస్తరించనున్నాయి.

ఒకవైపు 5జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తుండగా మరోవైపు మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేయాలనే నినాదం తెరపైకి వస్తుండటం ఆసక్తిని రేపుతోంది. తాజాగా మహారాష్ట్ర యావత్మల్ జిల్లాలోని బన్నీ గ్రామపంచాయతీ తమ గ్రామంలో సెల్ ఫోన్లను బ్యాన్ చేస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించడం చర్చనీయాంశంగా మారింది.

ఇదే విషయంపై బన్నీ గ్రామ సర్పంచ్ గజానన్ టేల్ మాట్లాడుతూ.. గ్రామంలోని చిన్నారులు.. యువకులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారని తెలిపారు. వీడియో గేమ్స్.. వెబ్ సైట్ సెర్చ్.. అశ్లీల వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 18ఏళ్లలోపు ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడకుండా నిషేధించాలని తీర్మానించినట్లు తెలిపారు.

మొబైల్ ఫోన్లు బ్యాన్ చేయాలనే తీర్మానికి గ్రామస్తులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని సర్పంచ్ టేల్ తెలిపారు. అయితే దీనిని అమలు చేయడం మాములు విషయం కాదని.. కౌన్సిలింగ్ ద్వారా సమస్యను పరిష్కారించుకుంటామని తెలిపారు. అవసరమైతే జరిమానాలను విధిస్తామని ఆయన పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో సెల్ ఫోన్ ను వినియోగించకుండా ఎవరు ఉండటం లేదు. ప్రతీ పనిని మొబైల్ ఫోన్ల ద్వారానే చాకచక చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక గ్రామ పంచాయతీ మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.