Begin typing your search above and press return to search.
కరోనా వార్డులకు... టీవీ, ఇంటర్నెట్ ఏర్పాట్లు చేయమన్న సీఎం!
By: Tupaki Desk | 17 March 2020 8:30 PM GMTభారతదేశంలో కరోనా ప్రభావం ఇప్పటి వరకూ ఎక్కువగా రికార్డు అయ్యింది మహారాష్ట్రలోనే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ ఎక్కువమంది కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించారు. మహారాష్ట్రలో 26 వరకూ కరోనా కేసులు రిజిస్టర్ అయినట్టుగా సమాచారం. దేశం మొత్తం మీద వందకు పైగా కేసులను గుర్తిస్తే మహారాష్ట్రలో పాతికకు పైగా కేసులను గుర్తించారు.
మహారాష్ట్రకు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా అంటుకుందని గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన పలువురి లో ఈ లక్షణాలను గుర్తించారట. అలాంటి వారిని ఐసొలేటెడ్ వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తూ ఉన్నారు. అలాగే అనుమానితులను కూడా అలాంటి వార్డుల్లోకే తరలిస్తూ ఉన్నారు.
అయితే మామూలుగానే అలా సింగిల్ గా ఉండటం కష్టం. అందునా అంటువ్యాధి తరహా యిన కరోనా సోకిందని నిర్ధారించింది, లేదా అనుమానించి ఒక రూమ్ కు పరిమితం చేయడం అంటే వారి మానసిక ఆరోగ్యం మీద కూడా ఆ ప్రభావం పడవచ్చు. ధైర్యం చెప్పే వారు లేకపోగా.. అలా ఒకే చోటకు పరిమితం చేస్తే వారు మరింత భయపడవచ్చు. మరి ఈ విషయాన్నే గుర్తించారో ఏమో కానీ.. కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన వార్డుల్లో ఎంటర్ టైన్ మెంట్ ను కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా బాధితులకు చికిత్సను అందించే వార్డుల్లో టీవీ, ఇంటర్నెట్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఐసొలేటెడ్ వార్డుల్లో ఉండే వారు ఒంటరితనాన్ని ఫీల్ కాకుండా.. వారికి పొద్దుపోయేందుకు , వినోదం కోసం ఇంటర్నెట్-టీవీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారట. ఒంటరి తనంలో వారి లో లేని పోని ఆలోచనలు కలగకుండా ఈ మాత్రం వినోదం ఇవ్వడం మంచిదేనేమో!