Begin typing your search above and press return to search.

సెకండ్‌ వేవ్‌ వచ్చే ఛాన్స్ ఉంది..లాక్ డౌన్ పై తేల్చేసిన మంత్రి!

By:  Tupaki Desk   |   25 Nov 2020 11:30 AM GMT
సెకండ్‌ వేవ్‌ వచ్చే ఛాన్స్ ఉంది..లాక్ డౌన్ పై తేల్చేసిన మంత్రి!
X
కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి జోరు పెరుగుతూనే ఉంది. మధ్యలో కొన్ని రోజులు కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా , ఆ తర్వాత మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ , మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే , కరోనా విజృంభణ కారణంగా మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ విధించబోతున్నారు అంటూ గత రెండు , మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే మాట్లాడుతూ ... రాష్ట్రంలో మళ్లీ లాక్‌ డౌన్‌ విధించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

లాక్‌ డౌన్‌ విషయంపై నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ ‌డౌన్‌ విధించే పరిస్థితులు లేవు అని తెలిపారు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతో ప్రజలందరు ప్రభుత్వం సూచించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని , మరికొన్ని రోజుల పాటు కరోనా నియమాలు పాటిస్తే , ఆలోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని , అప్పుడు కరోనా నుండి పూర్తిగా బయటపడవచ్చు అని అన్నారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని, అనవసరంగా రద్దీగా ఉండే మార్కెట్ల వంటి ప్రదేశాల్లో తిరిగి ఇంకా రద్దీని పెంచవద్దని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే ప్రభుత్వం కచ్చితంగా కొన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని , దీనికి సంబంధించి త్వరంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. దేశంలోని ఢిల్లీ, గోవా, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో కూడా దీపావళి తర్వాత స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌ ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని వెల్లడించారు.