Begin typing your search above and press return to search.
మంగంపేట బైరెటీస్ కు మహర్దశ
By: Tupaki Desk | 24 May 2022 4:04 PM ISTకడప జిల్లాలోని మంగపేట బైరెటీస్ కు మహర్దశ మొదలవ్వబోతున్నట్లే ఉంది. మంగపేట బైరెటీస్ లో దొరికే లైమ్ స్టోన్ కొనుగోలుకు అమెరికాలోని మూడు కంపెనీలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. బైరెటీస్ అమ్మకాలను అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి అమెరికాలో పర్యటించారు. మంగపేటలో దొరికే బైరెటీస్ వివరాలను అందించారు.
అమెరికన్ మార్కెట్ కు సంబంధించి అనేక కంపెనీలతో సమావేశమై నిక్షేపాల విలువ, క్వాలిటి, క్వాంటిటి, మార్కెటింగ్ తదితరాలపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనేక కంపెనీలతో చర్చల తర్వాత మూడు కంపెనీలు బాగా ఆసక్తి చూపటం తో వెంటనే వాటితో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఇపుడు జరిగిన అవగాహన ఒప్పందాల విలువ రు. 750 కోట్లుంటుందని ద్వివేది చెప్పారు. మూడేళ్ళల్లో కంపెనీలు అడిగినంత క్వాంటిటీని అమెరికాకు సరఫరా చేయాల్సుంటుంది.
ఇప్పటికే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న మూడు కంపెనీలు కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా ఆసక్తిగా ఉన్నాయట. అంటే ద్వివేది చెప్పిన లెక్క ప్రకారం మరో రు. 250 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగే అవకాశముంది.
మంగపేట బైరెటీస్ ను అమెరికా కంపెనీలు కొనటం ఇదే మొదటసారి. ప్రపంచ దేశాల్లో దొరికే బైరెటీస్ కన్నా మంగంపేటలో దొరికే బైరెటీస్ నిక్షేపాల క్వాలిటి ఎక్కువగా ఉండటం, ధరలు తక్కువగా ఉండటంతోనే కంపెనీలు అవగాహనా ఒప్పందాలు చేసుకున్నట్లు ద్వివేది చెప్పారు.
మూడు కంపెనీలు 16 లక్షల టన్నుల బైరెటీస్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికన్ మార్కెట్లో ఎక్కువగా సీ, డీ, డబ్య్లూ గ్రేడ్ బైరెటీస్ కు బాగా డిమాండ్ ఉంది. సరిగ్గా అలాంటి క్వాలిటీయే మంగంపేటలో దొరుకుతోంది. బైరెటీస్ ఖనిజాన్ని ప్రధానంగా సిమెంట్ తయారీలో ఎక్కువగా వాడుతారు. మంగంపేటలో 70 లక్షల టన్నుల బైరెటీస్ నిల్వలున్న కారణంగా ఇంకా అనేక కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ఏదేమైనా అమెరికాకు మన బైరెటీస్ ను ఎగుమతి చేయటం వల్ల కొందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నది వాస్తవం.