Begin typing your search above and press return to search.
కాషాయ గాంధీ.. యూపీ స్పెషల్
By: Tupaki Desk | 3 Aug 2018 7:36 AM GMTఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి అధికారంలోకి వచ్చి కాషాయాంబరధారి అయిన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రమంతటా కాషాయం రంగు పులిమేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయానికి కాషాయ వర్ణం అద్దారు. తరువాత వరుసగా ప్రభుత్వ భవనాలకు, పోలీస్ స్టేషన్లకు కాషాయం రంగు వేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాషాయం పులిమారు. తాజాగా మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా కాషాయం రంగు వేశారు.
షాజహాన్ పూర్ లోని ధాకా ఘన్ శ్యామ్ పూర్ లోని గ్రామ సభ భూమిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాషాయం రంగు వేశారని పోలీసులు చెప్పారు. ఈ విగ్రహం తెలుపు రంగులో ఉండేదని వారన్నారు. రాత్రికి రాత్రే మహాత్ముడి విగ్రహం రంగు మారిపోవడంతో గ్రామంలో ఉద్రిక వాతావరణం నెలకొంది. స్థానిక బిజెపి నేతలు దీనికి కారణమని గ్రామస్థులు ఆరోపించారు. ఈ సమాచారం తెలియగానే పెద్దయెత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మహాత్ముడి విగ్రహానికి తిరిగి తెలుపు రంగు వేయాలని - నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అంతకుముందు అంబేద్కర్ విగ్రహాల విషయంలోనూ ఇలాగే జరిగింది. నీలం - బ్రౌన్ కలర్లలో ఉండే అంబేద్కర్ విగ్రహాలకు కాషాయ రంగు వేశారు. దానిపై దళితుల నుంచి నిరసనలు రావడంతో చాలాచోట్ల మళ్లీ వాటి రంగులు వేశారు. ఆదిత్యనాథ్ తీరు చూస్తుంటే ముందుముందు ఉత్తరప్రదేశ్‌లో ఏం నిర్మించాలన్నా దానికి కాషాయ రంగు వేస్తేనే అనుమతులిచ్చేలా ఉణ్నారని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.