Begin typing your search above and press return to search.
షాకింగ్ః బౌద్ధ సన్యాసిగా మహేంద్ర సింగ్ ధోనీ.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 14 March 2021 10:52 AM GMTధోనీకి స్పెషల్ క్రేజ్ రావడం వెనుక అతడి బ్యాటింగ్ మొదటి కారణమైతే.. రెండోది అతడి హెయిర్ స్టైల్. మహేంద్ర సింగ్ భారీ జులపాలు.. క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ధోనీ.. ఒక్కసారిగా జుట్టు తీసేశాడు. దీంతో అభిమానులు షాకయ్యారు. ఆ తర్వాత రెగ్యులర్ జుట్టుకు అలవాటు పడిపోయారు.
కానీ.. ఇప్పుడు హఠాత్తుగా ఆ జుట్టుకూడా తీసేసి, క్లీన్ షేవ్ చేసుకున్న గుండతో దర్శనమిచ్చాడు మాజీ కెప్టెన్! అంతేకాదు.. బౌద్ధ సన్యాసులను పోలిన దుస్తులను ధరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగింది? ధోనీ ఎందుకిలా మారిపోయాడని డిస్కస్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అయితే.. ఈ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ట్వీట్ చేయడం.. ఈ అవతారం గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి? అని అడగడంతో.. ఈ ఫొటో వెనక కథేంటో ఊహిస్తున్నారు కొందరు. త్వరలో మొదలు కాబోతున్న ఐపీఎల్ కు సంబంధించిన యాడ్ షూట్ లో భాగంగా తీసిన ఫొటో కావొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఐపీఎల్-21 సీజన్ త్వరలో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ.. మ్యాచ్ లను ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నామో కూడా ప్రకటించింది. హోమ్ గ్రౌండ్లలో కాకుండా.. అన్ని జట్లూ తటస్థ వేదికలపైనే ఆడనున్నాయి. అయితే.. హైదరాబాద్ కు మాత్రం మ్యాచ్ లను నిర్వహించే అవకాశం దక్కలేదు.