Begin typing your search above and press return to search.
సీఎం జగన్ సింప్లిసిటీ మెచ్చిన మహేష్
By: Tupaki Desk | 11 May 2022 4:20 AM GMTఏపీలో సినిమా టిక్కెట్ ధరల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠభనల కి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో శాశ్వత పరిష్కారం దొరికిన సంగతి తెలిసిందే. పరిశ్రమ బిడ్డగా చిరంజీవి ముందుండి నడిపించడంతోనే ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో చిరంజీవిపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని ఖాతరు చేయకుండా ముందుకు సాగి ఆరోగ్యకరమైన వాతావరణంలో ముందుకుసాగారు.
అందుకే చిరంజీవిని రాజమౌళి పరిశ్రమ బిడ్డగా కాదు..పెద్దగానే ట్రీట్ చేస్తానని పబ్లిక్ గానే చెప్పారు. ఈ విషయంలో చిరంజీవితో పాటు ఆయన వెనుకుండి ప్రోత్సహించడంలో సూపర్ స్టార్ మహేష్..రెబల్ స్టార్ ప్రభాస్..రాజమౌళి కీలక పాత్ర పోషించారు. నేరుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఈ త్రయం భేటీ అయింది. అనంతరం చిరంజీవి వల్లే పరిష్కారం దొరికిందని సదరు హీరోలు సైతం మెచ్చారు. చిరంజీవి గనుక లీడ్ తీసుకోకపోయి ఉంటే ఈ వివాదం మరింత ముదిరేది.
తాజాగా 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్ లో భాగంగా సీఎం జగన్ గురించి మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సీఎంతో తన ఇంటరాక్షన్ గురించి వెల్లడించి సంతోషం వ్యక్తం చేసారు. ''నేను జగన్ గారితో రెండుసార్లు ఫోన్ లో మాత్రమే మాట్లాడాను. నేరుగా ఎప్పుడూ కలవలేదు. ఫిబ్రవరిలో జరిగిన సమావేశం నా మొట్ట మొదటి ఇంటరాక్షన్ చూసి ఆశ్చర్యపోయాను.
అతను చాలా సాదాసీదా వ్యక్తి. జగన్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం ఎంతో నచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అతను అంత సింపుల్ గా ఉండటం చూసి నిజంగా షాక్ అయ్యాను. పరిశ్రమకి సంబంధించిన అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. వాటి గురించి కూలంకుశంగా మాతో కలిసి చర్చించారు.
మా సమస్యలపై ఎంతో సానుకూల దృక్ఫథంతో స్పందించారు. వాటిని త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్ గారితో ఈ నా మొదటి సమావేశం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదొక మెమోరిబుల్ ఇన్సిడెంట్. ఆయన సింపుల్ సిటీ నాకు బాగా నచ్చిన క్వాలిటీ అని మహేష్ పేర్కొన్నారు. చిరంజీవి ఎంట్రీతోనే టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు దొరికింది.
అలాగే థియేటర్ల విషయంలో నెలకొన్న సమస్యలకి త్వరిత గతిన పరిష్కారం దొరికింది. మే 12న సర్కారు వారి పాట రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో వారం -పది రోజుల పాటు టిక్కెట్ ధర పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ వైకాపా మద్దతుదారుగా ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ హయాం దగ్గర నుంచి ఆ పార్టీతో.. ఆ కుటుంబంతో కృష్ణకి మంచి అనుబంధం ఉంది.