Begin typing your search above and press return to search.

మ‌హేష్‌.. గౌత‌మ్.. ఒక అరుదైన ఫొటో

By:  Tupaki Desk   |   9 Jun 2019 4:41 PM GMT
మ‌హేష్‌.. గౌత‌మ్.. ఒక అరుదైన ఫొటో
X
మ‌హ‌ర్షి విజ‌యానందంలో ఉన్న సూపర్ స్టార్ మ‌హేష్ బాబు కొన్ని రోజులుగా కుటుంబంతో క‌లిసి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్.. పిల్ల‌లు గౌత‌మ్ - సితార‌ల‌తో క‌లిసి ఆయ‌న ముందుగా జ‌ర్మ‌నీకి వెళ్లి.. అక్క‌డి నుంచి ఇట‌లీలో విహ‌రించి.. చివ‌ర‌గా ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టాడు. ప్ర‌స్తుతం ప్ర‌తిష్టాత్మ‌క వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ఇంగ్లాండే ఆతిథ్య‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం లండ‌న్‌లో భార‌త్‌-ఆ్ర‌స్ట్రేలియా మ్యాచ్ జ‌రుగుతున్న స్టేడియానికి కుటుంబంతో క‌లిసి వెళ్లాడు మ‌హేష్‌. గౌత‌మ్‌ కు క్రికెట్ అంటే పిచ్చి. అత‌డి కోస‌మే మ‌హేష్ కుటుంబాన్ని తీసుకుని మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. అక్క‌డ త‌న కొడుకుతో క‌లిసి మ‌హేషే స్వ‌యంగా సెల్ఫీ తీసుకున్నాడు.

ఆ చిత్రాన్ని ట్విట్ట‌ర్లో పెట్టి ఇది.. కొడుకు కోస‌మే అంటూ ట్వీట్ పెట్టాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో పాటు మహేష్ - న‌మ్ర‌త‌ - గౌత‌మ్ - సితార ఉన్న ఫొటోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. వీరితో మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూడా జాయిన్ కావ‌డం విశేషం. మ‌హ‌ర్షి విడుద‌లైన‌ప్ప‌టి నుంచి మ‌హేష్ లెక్క‌లేన‌న్ని పార్టీలు చేసుకున్నాడు. అప్ప‌ట్నుంచి ఏ ట్వీట్ పెట్టినా *సెల‌బ్రేటింగ్ మ‌హ‌ర్షి* అని ట్యాగ్ చేస్తున్నాడు. లండ‌న్ స్టేడియంలో వంశీ కూడా జాయిన్ అయ్యేస‌రికి ఇది కూడా మ‌హ‌ర్షి సంబ‌రాల్లో భాగ‌మే అని అభిమానులు అంటున్నారు.