Begin typing your search above and press return to search.
మహేష్ కు లేఖ రాసి విద్యార్థి ఆత్మహత్య!
By: Tupaki Desk | 27 April 2018 1:07 PM GMTహైదరాబాద్ లో ట్రిపుల్ ఐటీ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో సీఎస్‌డీ నాలుగో సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థి ....హాస్టల్ లోని తన రూంలో ఉరివేసుకొని చనిపోయాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని....భారతీయ బంధుత్వ వ్యవస్థ బాగోలేదని రాసిన సూసైడ్ నోట్ ఆ గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు, హీరో మహేష్ బాబుకు రాసిన మరో లేఖను కూడా పోలీసులు గుర్తించారు. తనకు మహేష్ అంటే చాలా అభిమానమని, తనకు మనసు బాగోలేనపుడు ఆయన సినిమాలు చూసి సాంత్వన పొందుతానని అందులో రాసి ఉంది.
బెంగళూర్‌లో ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ గా పని చేస్తోన్న పులి శ్రీనివాస్ రెడ్డి చిన్న కుమారుడు పులి సునంద్ కుమార్ రెడ్డి(21) గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్నాడు. గురువారం ఉదయం మిత్రుడు రోహిత్....సునంద్ గది తలపు కొట్టినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. కిటికీలో నుంచి చూడగా ....సునంద్..బెడ్‌షీట్‌తో ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించాడు. సునంద్ మిత్రులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహంతో పాటు రెండు సూసైడ్ నోట్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాను ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నందుకు తనను క్షమించాలని రాసి ఉంది. తన తల్లిదండ్రుల తరుఫున బంధువులంటే తనకు ఇష్టం లేదని, వారు అవసరానికి వచ్చి వెళ్లేవారని, భారతీయ బంధుత్వ వ్యవస్థ బాగా లేదని ఆ లేఖలో ఉంది. మహేష్ బాబుకు వీరాభిమాని అనిన సునంద్ గది నిండా మహేష్ ఫొటోలు అంటించినట్లు పోలీసులు తెలిపారు. ఒత్తిడికి లోనైనప్పుడు మహేష్ సినిమాలు చూస్తాడని స్నేహితులు అన్నారు. ``నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీ సినిమాలే చూస్తాను.. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మీరే నా డాక్టర్ - మీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు....’ అంటూ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ తోటి విద్యార్థి హఠాన్మరణంతో ఆ హాస్టల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.