Begin typing your search above and press return to search.
పవన్ పై కత్తి మొదటి గెలుపు..రెండో దానికై పోరాటం
By: Tupaki Desk | 19 Jan 2018 5:23 PM GMTకొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి చాలా రకాలుగా వేధింపులు ఎదుర్కొంటున్నానంటూ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ఇంటర్వ్యూలలో వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొనడానికి మహేశ్ కారులో వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పనే అంటూ కత్తి మహేశ్ చెబుతున్నాడు. అంతే కాదు.. వారిపై ఆయన ఇవాళ పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు.
అయితే, ఈ ఫిర్యాదు తర్వాత ఓ టీవీ చానల్ లో ఆసక్తికర చర్చ జరిగింది. కత్తి మహేష్ తో పాటుగా పవన్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులం గురించి గతంలో పవన్ చేసిన ట్వీట్ ను మళ్లీ చేస్తే..తాను పవన్ చిత్తశుద్ధిని విశ్వసిస్తానని కత్తి పేర్కొన్నారు. అయితే ఈ చర్చ పూర్తయిన తర్వాత...పవన్ పేరుతో అభిమానులకు ట్విట్టర్ లో ఓ సందేశం విడుదలైంది. కులం గురించి - వివాదం గురించి పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ పై మళ్లీ కత్తి రియాక్టయ్యారు. తన పోరాటంలో మొదటి ఫలితం వచ్చిందంటూ ట్వీట్ చేశారు. కులం గురించి - ఫ్యాన్స్ గురించి పవన్ స్పందించాలని తాను కోరగా...పవన్ స్పందించడం సంతోషకరమన్నారు. వివాదం గురించి కూడా పవన్ స్పందించాలని అన్నారు.
మరోవైపు ఈ చర్చ అనంతరం పవన్ విడుదల చేసిన లేఖ గురించి కూడా కత్తి మహేష్ రియాక్టయ్యారు. పవన్ స్వయంగా క్షమాపణ చెప్పేంత వరకూ తాను విశ్రమించనని తేల్చిచెప్పారు. పవన్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. `ఈ లేఖ దాడి తర్వాత వచ్చిందంటే దాడి కోసం మీరు వేచి చూస్తున్నారా?. ఒక వేళ ఆ దాడిలో ఏమైనా అయ్యింటే పరిస్థితేంటి? మీరు పట్టించుకునేవారా? నిర్ధంద్వంగా పవన్ తన అభిమానులు చేసిన చర్యలకు క్షమాపణలు చెప్పకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది`` అని కత్తి మహేశ్ ఖరాకండిగా తేల్చేశాడు. తద్వారా తన రెండో లక్ష్యం పవన్ క్షమాపణలు అంటూ చెప్పేశారు.