Begin typing your search above and press return to search.
బాబు కన్నా పవన్ గొప్పవాడా?: కత్తి మహేశ్
By: Tupaki Desk | 17 Jan 2018 8:58 AM GMTసినీ నటుడు - ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య కొద్దిరోజులుగా వెర్బల్ వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. చినికిచినికి గాలివానగా మారుతున్న ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు టాలీవుడ్ ప్రముఖులు కోన వెంకట్ ముందుకు వచ్చిన విషయం విదితమే. జనవరి 15 వరకు పవన్ అభిమానులు - కత్తి మహేశ్ లు ఇద్దరు సంయవనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ఆ రోజున కోన - మహేశ్ ల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ, పండుగ పూటకూడా పవన్ ఫ్యాన్స్ తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదని మహేశ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా చానెల్ తో మాట్లాడిన మహేశ్ పవన్ పై అసహనం వ్యక్తం చేసారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యక్తిత్వం పవన్ కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ అభిమానులు బానిసల్లా బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళుతున్న తనను పవన్ ఫ్యాన్స్ వెంబడించారని, తన తండ్రిని వారు కలవాల్సిన అవసరం ఏముందని మహేశ్ ప్రశ్నించారు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ స్పందించకుంటే ఈ మాటల యుద్ధం కొనసాగించడం తప్ప తనకు వేరేదారిలేదని మహేశ్ అన్నారు. వారు తనను రెచ్చగొట్టే కొద్దీ....పవన్ పై ఎదురుదాడి చేస్తానని, తన అభిమానులను నియత్రించుకోలేనివాడు ప్రజానాయకుడిగా పనికిరాడన్నారు. తన వల్ల సామాన్యులకు కలిగిన ఇబ్బందిపై చంద్రబాబు క్షమాపణలు చెప్పగా - తనకు పవన్ ఎందుకు క్షమాపణలు చెప్పరని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే పవన్ గొప్పవాడు కాదని - మోడీ - చంద్రబాబు - జగన్ లపై కామెంట్ చేసినట్లుగా పవన్ పై చేయకూడదా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో పవన్ పై స్వతంత్ర్య అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని సవాల్ విసిరారు. మరి , ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.