Begin typing your search above and press return to search.
పవన్ పై మళ్లీ కత్తి దూసిన మహేష్
By: Tupaki Desk | 4 Jan 2018 1:22 PM GMTజనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరోమారు సిని క్రిటిక్ కత్తిమహేష్ మరోమారు మండిపడ్డారు. ఈ దఫా పరుషమైన పదాలతో విరుచుకుపడ్డారు. డైరెక్టుగా పేరును ప్రస్తావించనప్పటికీ...పవన్ సహా ఆయన ఫ్యాన్స్ పై విమర్శలు గుప్పించారు. ఫేస్ బుక్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టిన మహేష్ కత్తి పవర్ స్టార్ అభిమానులపై విరుచుకుపడ్డారు. పవన్ ఓ ఏబ్రాసి అని పేర్కొంటూ...మరింత ఏబ్రాసిని చేయవద్దని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పవన్ ఫ్యాన్స్ పేరును నేరుగా ప్రస్తావించకుండా...`మీరు తిట్టే ప్రతి బూతు. కూసే ప్రతికూతా. చేసే ప్రతి కాల్. వచ్చే ప్రతి బెదిరింపు ఇప్పుడు మీ ప్రవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఘోరీ కట్టడానికి వాడతాను. గుర్తుపెట్టుకొండి.` అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా...పవన్ రాజకీయ విధానాలను సైతం కత్తి మహేష్ కామెడీ చేసేశారు. `ఒక జోకర్ ని మరొక జోకర్. ఒక బ్రోకర్ ని మరొక బ్రోకర్ సమర్ధించుకోవడం సహజం. చేతకానితనాన్ని మౌనంతో అధిగమించడంలో కనీసం కొంత తెలివి ఉంది. మీలాంటోళ్లు అనవసరంగా మొరిగి పవన్ కళ్యాణ్ ని మరీ ఏబ్రాసిని చేయకండి. ఆల్రెడీ చాలా వరకూ అయ్యాడు.` అంటూ ఎత్తిపోడిచారు.
కాగా, తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించాడు మహేష్. తాను కొంత సంయమనం కోల్పోయానని కొందరు మిత్రుల వలే తనకు కూడా అనిపించిందని అంగీకరిస్తూనే....అందుకు కారణాలను వివరించాడు. `పవన్ కళ్యాణ్ అభిమానులు నా వృత్తిని - నా ఉనికిని నా వ్యక్తిగత జీవితాన్ని - నా కుటుంబ సభ్యులని - న్యూనపరుస్తూ ఎలాంటి వ్యాఖ్యలు అన్ని చోట్లా చేస్తున్నారో గమనించాలి``అని కత్తి మహేష్ కోరారు. తాను సంయమనం పాటిస్తూనే ఉన్నానని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హద్దులు దాటుతున్నారు అయినప్పటికీ... నేను ఇంకా మర్యాద దాటకుండానే సమాధానం ఇస్తున్నాను. ఇంకా సంయమనం పాటిస్తూనే ఉన్నాను. ఆ చెలియలకట్ట తెగేదాకా తీసుకురాకండి. అది జరిగిన రోజున ఖర్చైపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి` అని హెచ్చరించారు.
కాగా, ఓ మహిళా నెటిజన్ మహేష్ కు ఫేస్ బుక్ లో ఈ సంవాదం విషయమై ప్రశ్నించగా...ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. `ఇంకెంతకాలం ఈ ఘోరాల్ని చూడాలి? పీకే ఫ్యాన్స్ కి మీరు కౌంటర్ ఇవ్వడం వాళ్లు మతగ్రంథాల్లో నేర్చిన భూతులన్నీ ఏరుకొచ్చి మీ మీద ప్రయోగించడం - ఈ జన్మకీ ఎంటర్ టైన్ మెంట్ చాలు!` అంటూ వ్యాఖ్యానించగా... `వాళ్ళు కొనసాగించినంత వరకు ఇది కొనసాగుటుంది అని మొదట్లో చెప్పేవాడిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం వరకూ సాగుతుంది. బీ రెడీ!` అని తానెంత మొండిఘటమో చెప్పకనే చెప్పాడు కత్తి మహేష్.
కాగా, పవన్ పై తరచుగా విరుచుకుపడే మరో విమర్శకుడు బొగ్గుల శ్రీనివాస్ ఈ ఆన్ లైన్ రచ్చ మరింత హీట్ పెంచారు. `పవన్ కళ్యాణ్ అనేవాడు ఆల్రెడీ ఏబ్రాసియే...కొత్తగా ఏబ్రాసిని చెయ్యవలసిన అవసరం లేదు` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.