Begin typing your search above and press return to search.
మరో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ కి కరోనా !
By: Tupaki Desk | 3 Aug 2020 5:00 AM GMTదేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుండి ప్రజాప్రతినిధుల వరకు అందరూ కరోనా కాటుకి బలవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రజా ప్రతినిథుల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ కరోనా భారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లా పఠాన్ చెరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు.
అలాగే, టీఆర్ ఎస్ నేత, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. లక్ష్మణ్ డ్రైవర్, ఇద్దరు గన్ మన్లు, ఇంట్లోని పనివారికి కూడా కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నారదాసు కుటుంబం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టుగా ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. టీఆరెస్ పార్టీలో ఒక్కక్కరుగా కరోనా భారిన పడుతుండటంతో ఇతర నేతల్లో కరోనా టెన్షన్ మొదలయింది.
కాగా, తాజాగా తెలంగాణలో కొత్తగా 983 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660 కి చేరింది. ఆసుపత్రుల్లో 18,500 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 48,609 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 551కి చేరింది.