Begin typing your search above and press return to search.

ఈ ఇద్ద‌రు మంత్రులు చాలు..కేసీఆర్‌ ప‌రువు తీసేందుకు

By:  Tupaki Desk   |   30 Nov 2019 4:53 AM GMT
ఈ ఇద్ద‌రు మంత్రులు చాలు..కేసీఆర్‌ ప‌రువు తీసేందుకు
X
ఉద్వేగ‌భ‌రిత‌మైన సంద‌ర్భాల్లో, స‌మాజం అంతా ఆక్రోషంతో త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న త‌రుణంలో..ఎవ‌రైనా ఏం చేయాలి? స‌ంయ‌మ‌నం పాటించాలి. ముఖ్య‌మైన స్థానాల్లో ఉన్న‌వారైతే...ప‌రిణ‌తిని చూపాలి. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు మంత్రుల‌కు ఆ ప‌రిణ‌తే లోపించిన‌ట్లుంద‌ని, వారిద్ద‌రి కార‌ణంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఊహించని చిక్కుల్లో ప‌డ్డార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌ద్యంమత్తులో కామాంధులుగా మారిన నలుగురి మధ్య నలిగిపోయి దారుణ హ‌త్య‌కు గురైన ప్రియాంక రెడ్డి హ‌త్య విష‌యంలో...తెలంగాణ రాష్ట్ర మంత్రులైన మ‌హమూద్ అలీ, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ చేసిన కామెంట్లు వివాదాస్ప‌దంగా మారాయి.

ప్రియాంక మ‌ర‌ణం అనంత‌రం ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ ఆమె తన కూతురులాంటిదన్నారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగిస్తామని నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామని ప్ర‌క‌టించారు. ప్రియాంక రెడ్డి తన సోదరికి ఫోన్ చేసే కంటే పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. ఎవరు ప్రమాదంలో ఉన్నా డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేయాల్సిందిగా సూచించారు...ఫోన్‌ వచ్చిన 3 నిమిషాలలోపే పోలీసులు స్పందిస్తారని హోంమంత్రి పేర్కొన్నారు. సాక్షాత్తు హోంమంత్రి మహమూద్ అలీ ఇలా వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన త‌రుణంలో మ‌రోమంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ వ్యాఖ్యలు క‌ల‌క‌లం సృష్టించాయి.

ప్రియాంక కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ స్పందిస్తూ, తెలంగాణ పోలీసులు క్రియాశీలంగా స్పందిస్తున్నార‌న్నారు. సీసీ కెమెరాల‌తో పోలీసుల‌తో ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఉన్నార‌ని పేర్కొంటూ ప్ర‌తి ఇంటికి ఓ పోలీసును ఉంచ‌లేం క‌దా? అని ఆయ‌న వ్యాఖ్యానించడం వివాదాస్ప‌దంగా మారింది.