Begin typing your search above and press return to search.
ఇప్పపువ్వుతో లడ్డూలు.. ఎన్ని ఔషధవిలువలో తెలుసా?
By: Tupaki Desk | 28 March 2021 12:30 AM GMTతెలంగాణ పల్లె వాసులకు ఇప్ప చెట్టు.. ఇప్ప పువ్వుల గురించి తెలిసే ఉంటుంది. వృక్షశాస్త్ర పరిశోధకులకు, విద్యార్థులకు ఈ చెట్టు గురించి తెలిసే అవకాశం ఉంది. నిజానికి చాలా మంది గిరిజనులు ఇప్పపువ్వుతో సారా తయారుచేసేవాళ్లు. ప్రస్తుతం సారాపై నిషేధం ఉంది. అయితే ఇప్పపువ్వుల్లో మాత్రం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సారా బట్టీలు పెట్టి.. ఇప్ప పువ్వును ఉపయోగించి సారాను తయారుచేస్తుంటారు . ప్రస్తుతం అక్కడక్కడ అక్రమంగా ఇప్పసారాను తయారుచేస్తుంటారు.
ఇదిలా ఉంటే ఇప్పపూలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ఇప్పపూలతో రక్త హీనత అనే సమస్యను తగ్గించవచ్చని చెబుతున్నారు. మనదేశంలో చాలా మంది గర్భిణులకు రక్త హీనత సమస్యగా ఉంది. గర్భిణులకు రక్త హీనత సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ఉచితంగా పోషకాహారాన్ని అందిస్తున్నది. పట్టణ ప్రాంత ప్రజలతో పాటు ఏజెన్సీ ప్రాంత మహిళల్లోనూ ఈ సమస్య ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇప్పపూలతో రక్తహీనతను తగ్గించవచ్చని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పపూలతో లడ్డూలూ తయారుచేసి వాటిని గర్భిణులకు పంచుతున్నారు వైద్య సిబ్బంది. తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ గర్భిణుల్లో లక్షమందిలో 152 మంది, వెయ్యి మంది అప్పుడే పుట్టిన శిశువుల్లో48 మంది చనిపోతున్నారు. రక్త హీనత వల్లే ఈ సమస్య ఎదురవుతుందని డాక్టర్లు గుర్తించారు.
గర్భిణుల్లోనైతే హిమోగ్లోబిన్ 3నుంచి 5శాతం కూడా ఉండక ఎర్ర రక్త కణాలు తగ్గిపోతున్నాయి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు.ఇప్పపువ్వులో ఉండే ఐరన్ తో రక్త హీనత పోతుందని వైద్యులు గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పచెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ఇప్పపూలను ఉపయోగించి వాటితో లడ్డూలను తయారుచేసి గర్భిణులకు పెట్టబోతున్నారు వైద్యశాఖ అధికారులు. ఏప్రిల్ నుంచి ఈ లడ్డూలను తయారుచేయబోతున్నారు.