Begin typing your search above and press return to search.

వార్తల్లో మునిగే ఆ మహిళా జర్నలిస్టుకు మొయిల్.. టెస్టు చేస్తే షాకింగ్ నిజం

By:  Tupaki Desk   |   26 July 2020 4:11 AM GMT
వార్తల్లో మునిగే ఆ మహిళా జర్నలిస్టుకు మొయిల్.. టెస్టు చేస్తే షాకింగ్ నిజం
X
విన్నంతనే ఒప్పుకోరు కానీ నిజమిది. మనల్ని అభిమానించేటోళ్లు మనల్ని పట్టించుకున్నంతగా ఒక్కోసారి మనల్ని మనం కూడా పట్టించుకోం. తాజాగా ఈ మాటకు అర్థమేమిటో.. ఒక మహిళా జర్నలిస్టుకు తెలీటమే కాదు.. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నిత్యం వార్తల్ని ప్రజలకు అందజేయాలన్న తప్పించి.. తన గురించి తాను పట్టించుకోని ఆ మహిళా జర్నలిస్టుకు ఎదురైన అనుభవం విన్నాక.. ఒంటి మీదా.. ఆరోగ్యం మీద కాసింత శ్రద్ధ అవసరమన్న విషయం అర్థమవుతుంది.

ఫ్లోరిడాకు చెందిన విక్టోరియా ప్రైస్ అనే మహిళా జర్నలిస్టు డబ్ల్యూఎఫ్ఎల్ఏ చానల్ లో పని చేస్తుంటుంది. పనిలో పడి తనను తాను పెద్దగా పట్టించుకునేది కాదు. ఒక రోజు వార్తలు చదివిన తర్వాత తనకు వచ్చిన ఒక మొయిల్ ను చూసుకున్నారు. అందులో ఒకరు.. ‘‘మీ మెడ మీద చిన్న కణితి ఉంది. బహుశా అది క్యాన్సర్ కు సంబంధించింది కావొచ్చు. నా మెడ మీద కూడా ఇలాంటిదే వస్తే.. డాక్టర్ దాన్ని క్యాన్సర్ గా తేల్చారు. మీరు వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి’’ అని ఉండటంతో ఒక్కసారిగా కంగారుపడ్డారు.

అప్పటివరకూ ఆమెకు పట్టని చిన్న కణిత మెడ మీద కనిపించింది. ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించారు. ఆయన పరీక్షలు జరిపి షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చారు. మొయిల్ లో చెప్పినట్లే.. ఆమె మెడ మీద ఉన్నది క్యాన్సర్ కణితిగా తేల్చారు. కాకుంటే.. ప్రారంభదశలో ఉండటంతో దాన్ని సర్జరీ చేసి తొలగించారు. తనకు ఎదురైన అనుభవాన్ని విక్టోరియా ఫ్రైస్ సోషల్ మీడియాతో అందరికి పంచుకున్నారు. పని రీత్యా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని.. టీవీలో తనను చూసే ఒకరు మాత్రం తన గురించి పట్టించుకొని హెచ్చరించటంతో తాను ముప్పు నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. రేపు (సోమవారం) ఆమె తన క్యాన్సర్ కణితిని తొలగించుకునేందుకు సర్జరీ చేయించుకున్నారు. తనను అలెర్ట్ చేసినందుకు సదరు మొయిల్ పంపిన వీక్షకురాలికి మహిళా జర్నలిస్టు థ్యాంక్స్ చెప్పారు. ఉద్యోగంలో బిజీగా ఉండటం మామూలే. అలా అని ఆరోగ్యం మీద ఒక కన్నేసి ఉంచటం చాలా అవసరం. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.