Begin typing your search above and press return to search.

ప్రపంచకప్: భారత్ ఓటమికి ప్రధాన కారణమదే?

By:  Tupaki Desk   |   11 July 2019 4:47 AM GMT
ప్రపంచకప్: భారత్ ఓటమికి ప్రధాన కారణమదే?
X
అంబటి రాయుడు.. తెలుగు క్రీడాకారుడు. భారత జట్టులో 4వ స్థానంలో సుస్థిరమైన స్థానం సంపాదించాడు. కీలకంగా పరుగులు రాబట్టాడు. కానీ అతడిని ప్రపంచకప్ కు ఎంపిక చేయలేదు. దీంతో బీసీసీఐ, సెలెక్టర్లకు విసుగు చెంది రాయుడు మనస్థాపంతో రిటైర్ మెంట్ ప్రకటించాడు.

అయినా టీమిండియా సెమీస్ దాకా వీరలెవల్లో రాణిస్తుండడంతో అందరూ గమ్మున ఊరుకున్నారు. టాప్ ఆర్డర్ ముగ్గురే మ్యాచ్ ను గెలిపిస్తుండడంతో అందరూ రాయుడు లాంటి వాళ్లను పట్టించుకోలేదు. కానీ సెమీస్ లోనే అసలు కథ మొదలైంది. టాప్ ఆర్డర్ ముగ్గురు రోహిత్, రాహుల్, కోహ్లీ 1 పరుగు చేసి వెనుదిరిగారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈనేపథ్యంలో బలమైన మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ లేక టీమిండియా ఓడిపోయింది. ధోని, జడేజా ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. న్యూజిలాండ్ సహా మిగతా దేశాల క్రికెటర్లకు, భారత్ కు మధ్య ఉన్నది అదే తేడా. మిడిల్ ఆర్డరే సమస్యే భారత్ కొంప ముంచింది.

టీమిండియా విజయంలో ప్రధానంగా మూడు అడ్డుగా నిలిచాయి. ఒకటి టాస్ ఓడిపోవడం ఖాగా.. రెండోది వరణుడు. మూడోది టాప్ ఆర్డర్-మిడిల్ ఆర్డర్ వైఫల్యం. వర్షం వల్ల పిచ్ నెమ్మదించి బంతులు బుల్లెట్లలా రావడం కూడా ఓ కారణం. ఇక ఎంత సేపు అగ్ర టీం, అగ్ర బ్యాట్స్ మెన్ ఆలోచించారే కానీ.. పటిష్టమైన మిడిల్ ఆర్డర్ కొరతను టీమిండియా కానీ బీసీసీఐ కానీ పట్టించుకోలేదు. దీంతో టీమిండియా బొక్కబోర్ల పడింది. అతిగా టాప్ ఆర్డర్ మీద ఆధారపడింది. నాలుగో నంబర్ లో అంబటి రాయుడు సహా వేరే కొంచెం మెరుగైన ఆటగాడు ఉంటే మరోలా ఉండేదేమో.?

ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు టీమిండియా ఓటమికి కొన్ని తప్పులు, కొంత దురదృష్టం వెంటాడింది. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించేలా చేసింది.