Begin typing your search above and press return to search.
ప్రధాన వేదిక మీద కూర్చునేది ఎందరు?
By: Tupaki Desk | 20 Oct 2015 4:03 AM GMTమరో రెండు రోజుల్లో జరగనున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ ఎప్పడూ లేని విధంగా భారీగా శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో అన్నింటి కంటే వేదికను రూపొందించే విధానం కాస్తంత ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే.. ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు సంబంధించి భారీ వేదికల్ని ఏర్పాటు చేస్తారు. అయితే.. అందుకు భిన్నంగా.. మూడు వేదికల్ని తయారు చేస్తున్నారు.
ప్రధాన వేదికకు రెండు వైపులా రెండు వేదికలు ఏర్పాటు చేస్తారు. ఇక.. ప్రధాన వేదిక మీద ఎంతమంది కూర్చుంటారు? ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై ఒక స్పష్టత వచ్చేసింది. పిలుపుల కార్యక్రమం దాదాపుగా ఒక కొలిక్కి రావటం.. ప్రముఖులు ఎవరెవరు వస్తున్నారన్నది స్పష్టత వచ్చిన నేపథ్యంలో వేదిక మీద ఎవరెవరిని కూర్చోబెడతారన్న విషయాన్ని చూస్తే.. ప్రధాన వేదిక మీద కేవం 17 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
అదే సమయంలో ప్రధాన వేదికకు ఇరువైపులా ఉండే రెండు వేదికల మీద ఒక్కో వేదిక మీద 350 మంది చొప్పున మొత్తం 700 మంది కూర్చోనున్నారు. ఇప్పటివరకూ జారీ చేసిన పాసులు చూస్తే.. రైతులకు 30,700 పాసులు.. స్థానిక ప్రజాప్రతినిధులకు 40వేల మందికి పాస్ లు ఇచ్చారు.
ఇక.. ప్రధానవేదిక మీద కూర్చునే 17 మంది ఎవరన్న దానికి ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం అతి ముఖ్యులైన వారికే చోటు లభించనుంది. వీరిలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ.. తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు.. కేసీఆర్.. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య.. అసోం గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ వీ రమణ.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బోసాలే.. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు.. అశోక గజపతిరాజు.. సుజనా చౌదరి..నిర్మలా సీతారామన్.. బండారు దత్తాత్తేయలు ఆసీనులు కానున్నారు.వీరితో పాటు.. జపాన్.. సింగపూర్ మంత్రులకు వేదిక మీద కూర్చునే అవకాశం కల్పిస్తారు.