Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ చిరుత కంటే వేగంగా తప్పించుకుంటారన్న మజ్లిస్ అధినేత

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:46 AM GMT
ప్రధాని మోడీ చిరుత కంటే వేగంగా తప్పించుకుంటారన్న మజ్లిస్ అధినేత
X
మిగిలిన రాజకీయ పార్టీలకు కాస్తంత భిన్నంగా వ్యవహరించే తీరు మజ్లిస్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. పేరుకు రాజకీయ పార్టీ అనే కానీ.. అందుకు భిన్నమైన ఇమేజ్ తో బండి లాగిస్తుంటారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.

తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సమస్యలు వచ్చి పడినప్పుడు.. వెంటనే వాటి నుంచి తప్పించుకోవటంలో మోడీ చిరుత కంటే వేగంగా ఎస్కేప్ అవుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజస్థాన్ కు చేరుకున్న అసదుద్దీన్ ఓవైసీ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. నిరుద్యోగం లాంటి అంశాలను ప్రస్తావించిన రాహుల్.. "ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిరుత కన్న వేగంగా తప్పించుకుంటారు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు తప్పించుకుంటారు. చిరుత కంటే మోడీ వేగంగా ఉంటారు" అని వ్యాఖ్యానించారు.

ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ చాలా తెలివిగా తప్పించుకుంటారన్న మజ్లిస్ అధినేత నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకాలం మోడీని ఉద్దేశించి ఆయన.. ఎస్కేప్ అన్న మాటను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందన్న విషయంలోకి వెళితే.. అసలు ఇష్యూ ఏమిటంటే.. భారత్ లో అంతరించిపోతున్న చిరుతలను తిరిగి పెంచేందుకు చేస్తున్న కార్యక్రమాలపై విలేకరులు అసద్ ను ప్రశ్నించారు.

దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. ఇబ్బందికర పిరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ చాలా తెలివిగా వ్యవహరిస్తారన్నారు. భారత్ లో అంతరిస్తున్న చిరుతల సంఖ్యను పెంచేందుకు వీలుగా వాటి దిగుమతికి సంబందించి భారత సర్కారు ఒక ఒప్పందం చేసుకుంది.

ఇందులో బాగంగా నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ అభయారణ్యానికి తీసుకురానున్నారు. ఈ నెల 17న మోడీ పుట్టిన రోజును పురుస్కరించుకొని చిరుతుల ను పున: పరిచయ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోడీకి అసద్ వేసిన పంచ్ కాస్తంత తీవ్రంగానే తగిలినట్లుగా కనిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.