Begin typing your search above and press return to search.

మాస్టర్ ఫ్లాన్; గ్రేటర్ బరిలో ఒంటరిగా మజ్లిస్

By:  Tupaki Desk   |   13 July 2015 12:17 AM GMT
మాస్టర్ ఫ్లాన్; గ్రేటర్ బరిలో ఒంటరిగా మజ్లిస్
X
తెలంగాణ అధికారపక్షంగా తిరుగులేని అధికారంతో టీఆర్ ఎస్ చెలరేగిపోవటం తెలిసిందే. తెలంగాణలో విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. రాజకీయంగా తిరుగులేని అధిపత్యంతో వ్యవహరిస్తున్న అధికార పక్షానికి ఒక దిగులు వెంటాడుతోంది. తెలంగాణ రాజకీయం మొత్తం తమ చేతిలో తీసుకున్నప్పటికీ.. హైదరాబాద్ ను పాగా వేయటం మాత్రం సాధ్యం కాని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఎంతకూ కొరుకుడుపడని హైదరాబాద్ మీద గులాబీ జెండా ఎగరవేయటం ద్వారా.. తెలంగాణ మీద మొత్తం అధిపత్యం తమదేనని సంతోషపడటానికి గ్రేటర ఎన్నికలపై కేసీఆర్ అండ్ కో భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఇందుకోసం ఒక ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారని చెబుతారు. మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకోవటం ద్వారా.. హైదరాబాద్ లోని గ్రేటర్ ను సొంతం చేసుకోవాలని భావించటం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారని చెబుతూ.. గ్రేటర్ లోని ప్రతి వార్డులోనూ చెప్పుకోదగిన సంఖ్యలో మైనార్టీలు ఉంటారని. మజ్లిస్ తో కలిసి బరిలోకి దిగటం ద్వారా ఆ ఓట్లతో పాటు.. టీఆర్ ఎస్ కు ఉండే ఓటు బ్యాంక్ పక్కాగా పడుతుందని.. ఇక.. మిగిలిన ఓటు బ్యాంకును తెలుగుదేశం.. బీజీప.. కాంగెస్ లు పంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. తమ విజయం నల్లేరు మీద నడకగా గులాబీ దళం అంచనా వేసింది.

తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తు ఉండదని మజ్లిస్ అధినేత తేల్చి చెప్పేశారు. టీఆర్ఎస్.. మజ్లిస్ భాగస్వామ్యంలో కలిపి పోటీ చేస్తారన్న దానికి భిన్నంగా నిర్ణయం రావటంపై ఆశ్చర్యం వక్తమవుతోంది. అయితే.. ఈ నిర్ణయం వెనుక వ్యూహమే తప్పించి మరొకటి లేదని చెబుతున్నారు.

మజ్లిస్ తో ఎన్నికల్లో దోస్తీ అంటే.. నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకోవటమేనని.. హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మజ్లిస్ తో దూరంగా ఉండటమే మంచిదన్న వాదన విపిస్తోంది. మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకుంటే.. బీజేపీ మతం ఆయుధం బయటు తీస్తుందని.. అదే జరిగితే జరిగే నష్టం చాలా భారీగా ఉంటుదని.. దాంతో పోలిస్తే ఒంటరిగా పోటీ చేయటమే మంచిదన్న భావనలో అధికార టీఆర్ ఎస్ ఉందని చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మిత్ర బంధం బయటకు రాకుండా ఉండే ప్రయత్నంలోనే తాజా పరిణామంగా చెబుతున్నారు.