Begin typing your search above and press return to search.
పారిస్ ను కదిలించిన అగ్ని ప్రమాదం..
By: Tupaki Desk | 16 April 2019 10:04 AM GMTప్రశాంతతకు, ప్రకృతి ప్రేమికులకు ఆలవాలమైన పారిస్ నగరం అగ్నికీలల పొగలతో మసకబారింది. ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్ లో ప్రఖ్యాత ప్రసిద్ధ పురాతన చర్చి నోట్రే డామే కేథడ్రిల్ చర్చి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతోనే యావత్తు దేశం తీవ్ర దిగ్బ్రాంతికి లోనైందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తెలిపారు.
చర్చిలో ఆధునీకరణ పనులు కొనసాగుతుండగా.. ఒక్కసారిగా మంటలు అంటుకొని ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో కర్రల సాయంతో చేయడంతో చర్చి పైకప్పు పూర్తిగా పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అనేక గంటలపాటు నిరంతరాయంగా శ్రమించి మంటలను ఎట్టకేలకు అదుపులోకి తీసుకొచ్చారు.
దాదాపు 850 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడంతో ఫ్రాన్స్ ప్రజలకు విడదీయరాని బంధం ఉంది. ఫ్రెంచి నిర్మాణ శైలికి తార్కాణంగా దీన్ని చెబుతుంటారు. ఫ్రెంచి విప్లవం, పారిస్ స్వాతంత్ర్య పోరాటం లాంటి పలు కీలక ఘట్టాలకు ఈ చర్చి సాక్ష్యంగా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ చారిత్రక కట్టడం మంటలకు కాలిపోవడంతో దేశ ప్రజలంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
చారిత్రక చర్చి కాలిపోవడంతో దీన్ని పునర్మిర్నించడానికి ఫ్రెంచ్ బిలియనీర్ ఫ్రాంకోయిస్ హెన్నీ ఫినాల్ట్ ముందుకొచ్చారు. దీనికోసం 100 మిలియన్ యూరోలు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.