Begin typing your search above and press return to search.
కేసీఆర్ కాదన్న వ్యక్తికి రేవంత్ బీఫాం..
By: Tupaki Desk | 10 Jan 2020 11:04 AM GMTతెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల వేళ ఈ శుక్రవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవర్ లోడ్ అయిన టీఆర్ఎస్ లో బీఫాంలు దక్కని చాలా మందిని కాంగ్రెస్, బీజేపీలు తమవైపుకు తిప్పుకొని మరీ బీఫాంలు ఇచ్చి తమ పార్టీ తరుఫున పోటీచేయిస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ శివారు లోని ఫిర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం యుద్దం నడించింది. టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఫోకస్ అయిన టికెట్ ఆశించి భంగపడ్డ దర్గా దయాకర్ రెడ్డి ని కాంగ్రెస్ ఎగరేసుకు పోయింది. టీఆర్ఎస్ టికెట్ ఆయనకు దక్కక పోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంటనే దయాకర్ రెడ్డి ఇంటికెళ్లి మరీ కలిసి అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మేయర్ పదవికి హామీ ఇచ్చి టికెట్ ఇచ్చేశారు. బీఫాం కూడా అందజేశవారు.
అయితే ఈ విషయం తెలిసిన మంత్రి మల్లారెడ్డి అలెర్ట్ అయ్యి దయాకర్ రెడ్డి ఇంటికెళ్లి మరీ ఆయన్న వెంటపెట్టుకొని వెళ్లి తీసుకెళ్లిపోయారు. దయాకర్ రెడ్డి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ లో మంత్రి మల్లా రెడ్డి గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు.
దీంతో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ బీఫాం అందుకున్న దయాకర్ రెడ్డి అనంతరం మల్లారె డ్డి వచ్చి తీసుకెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో ఫీర్జాదిగూడలో టెన్షన్ నెలకొంది. దయాకర్ రెడ్డి ఏ పార్టీ తరుఫున నామినేషన్ వేస్తాడన్నది ఆసక్తిగా మారింది.