Begin typing your search above and press return to search.

జనాల సొమ్మును వాడేసిన కంపెనీల లిస్టు బయటకొచ్చింది!

By:  Tupaki Desk   |   21 Nov 2019 11:20 AM GMT
జనాల సొమ్మును వాడేసిన కంపెనీల లిస్టు బయటకొచ్చింది!
X
సామాన్యుడి అవసరాల కోసం బ్యాంకు నుంచి లక్ష రూపాయిల రుణం తీసుకోవాలంటే నిబంధనల పేరుతో చుక్కలు చూపించటం అందరికి అనుభవమే. మరి.. కంపెనీలకు బ్యాంకులు వేల కోట్లు ఇవ్వటమే కాదు.. ఉద్దేశపూర్వకంగా రుణాల్ని ఎగ్గొట్టే ముదురు కంపెనీలకు సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి.

సహ చట్టం కింద ది వైర్ మీడియా సంస్థ గత ఏడాది మేలో అప్లికేషన్ పెట్టగా వారి వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని పరిస్థితి. 2019 ఏప్రిల్ 30వ తేదీ వరకూ గడువు దాటిని 30 మంది అతి పెద్ద రుణ ఎగవేత దారుల జాబితాను తాజాగా వెల్లడైంది.

బ్యాంకులకు బ్యాండ్ వేసిన కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంకు ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ 30 కంపెనీల్లో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాల విలువ ఏకంగా రూ.50వేల కోట్లు ఉండటం విశేషం. ఈ భారీ మొత్తంలో ఇప్పటివరకూ బ్యాంకులు రద్దు చేసిన బాకీలు కూడా ఉన్నాయి.

2018లో ట్రాన్స్ యూనియన్ సిబిల్ లెక్కల ప్రకారం 2018లో పదకొండు వేల కంపెనీలు కలిపి బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం ఏకంగా రూ.1.61 లక్షల కోట్లతో సమానం. ఈ భారీ మొత్తాన్ని బ్యాంకులకు పంగనామాలు పెట్టేశాయి కంపెనీలు. తాజాగా వెల్లడైన జాబితాలోని కొన్ని ముదురు కంపెనీల పేర్లు చూస్తే..

1. గీతాంజలి డైమండ్స్ అండ్ జ్యూయలరీ లిమిటెడ్ రూ.5044కోట్లు
2. రిఐ అగ్రో లిమిటెడ్ రూ.4194 కోట్లు
3. విన్ సమ్ డైమండ్స్ అండ్ జ్యూయలరీ లిమిటెడ్ రూ.3386 కోట్లు
4. రుచి సోయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.3225 కోట్లు
5. రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2844 కోట్లు
6. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.2488 కోట్లు
7. కుడోస్ చెమీ లిమిటెడ్ రూ.2326 కోట్లు
8. జూమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2024 కోట్లు
9. దక్కన్ క్రానికల్ హెల్డింగ్స్ లిమిటెడ్ రూ.1951 కోట్లు
10. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ రూ.1875 కోట్లు
11. ఫరెవర్ ప్రీషియస్ జ్యూవలరీ అండ్ డైమండ్స్ రూ.1718 కోట్లు
12. సూర్య వినాయక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1628 కోట్లు
13. ఎస్ కుమార్ నేషన్ వైడ్ లిమిటెడ్ రూ.1581 కోట్లు
14. గిల్ ఇండియా లిమిటెడ్ రూ.1447 కోట్లు
15. సిద్ది వినాయక లాజిస్టిక్ లిమిటెడ్ రూ.1349 కోట్లు