Begin typing your search above and press return to search.
షార్ట్ ఫిలిం తీస్తే రూ.లక్ష
By: Tupaki Desk | 24 Jun 2015 10:22 AM GMTకూసింత క్రియేటివిటీ ఉండాలే కానీ తన్నుకొచ్చే అవకాశాలెన్నో. గతానికి భిన్నంగా బోలెడన్ని అవకాశాన్ని వచ్చి పడుతున్న మాటకు నిదర్శనంగా ఈ అవకాశాన్ని చెప్పొచ్చు.
రక్తదానం ప్రోత్సహించే ఉద్దేశ్యంలో కొందరు యువ స్నేహితులు కలిసి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ టు సపోర్ట్ వెబ్ సైట్ ఇప్పటికే లక్షలాది మందికి రక్తాన్ని అందించి ఆదుకుంది. రక్తదానం చేయాలన్న ఉత్సాహం ఉన్న వేలాది మందిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి.. ఎన్నో అద్భుతాల్ని సృష్టించింది. ఆపదలో ఉన్న లక్షలాది మందిని ఆదుకుంది.
ఈ వెబ్‌సైట్ ప్రతినిధులు తాజాగా జాతీయ రక్తసేకరణ సొసైటీతో కలిసి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీకి ఏ భాషలో నుంచైనా ఎంట్రీ పంపొచ్చని.. కాకుంటే ఇంగ్లిషులో సబ్ టైటిల్స్ ఉండాలని చెబుతున్నారు. 30 సెకన్లకు తగ్గకుండా.. మూడు నిమిషాలకు మించకుండా షార్ట్ ఫిలింస్‌ను రూపొందించి.. ఈ పోటీకి పంపాలని కోరుతున్నారు.
ఈ పోటీలో ప్రధమస్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష.. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు.. మూడోస్థానంలో నిలిచిన వారికి రూ.25వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు 9885039261 సంప్రదించవచ్చని.. లేదంటే. www.friends2support.org/shortfilm కూడా చూడొచ్చని చెబుతున్నారు. మరి.. ఆలస్యం ఎందుకు..? మెదడుకు పదును పెట్టి పేరునే కాదు..బహుమతిని కూడా కొల్లగొట్టే ఛాన్స్‌ను వదిలి పెట్టటం ఎందుకు?
రక్తదానం ప్రోత్సహించే ఉద్దేశ్యంలో కొందరు యువ స్నేహితులు కలిసి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ టు సపోర్ట్ వెబ్ సైట్ ఇప్పటికే లక్షలాది మందికి రక్తాన్ని అందించి ఆదుకుంది. రక్తదానం చేయాలన్న ఉత్సాహం ఉన్న వేలాది మందిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి.. ఎన్నో అద్భుతాల్ని సృష్టించింది. ఆపదలో ఉన్న లక్షలాది మందిని ఆదుకుంది.
ఈ వెబ్‌సైట్ ప్రతినిధులు తాజాగా జాతీయ రక్తసేకరణ సొసైటీతో కలిసి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీకి ఏ భాషలో నుంచైనా ఎంట్రీ పంపొచ్చని.. కాకుంటే ఇంగ్లిషులో సబ్ టైటిల్స్ ఉండాలని చెబుతున్నారు. 30 సెకన్లకు తగ్గకుండా.. మూడు నిమిషాలకు మించకుండా షార్ట్ ఫిలింస్‌ను రూపొందించి.. ఈ పోటీకి పంపాలని కోరుతున్నారు.
ఈ పోటీలో ప్రధమస్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష.. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు.. మూడోస్థానంలో నిలిచిన వారికి రూ.25వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు 9885039261 సంప్రదించవచ్చని.. లేదంటే. www.friends2support.org/