Begin typing your search above and press return to search.
ప్రార్థనా స్థలాలను కొవిడ్ కేర్ సెంటర్లు చేయండిః సుప్రీం
By: Tupaki Desk | 30 April 2021 1:30 PM GMTదేశంలో కరోనా మహమ్మరి అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు అత్యవసంగా చికిత్స అందించాలని.. ఆసుపత్రులన్నీ నిండిపోతున్నందున ప్రార్థనా స్థలాలను కూడా కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సూచించింది. కొవిడ్ కల్లోలంతో దేశంలో ఆక్సీజన్,మందుల కొరత ఏర్పడం, వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందకపోవడం వంటి సమస్యలను సుమోటోగా స్వీకరించింది అత్యున్నత ధర్మాసనం.
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. దేశంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ సంక్షోభ సమయంలో ప్రార్థనా స్థలాలతోపాటు హాస్టళ్లు వగైరా ప్రాంతాలను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని ఆదేశించింది. రిటైర్డ్ వైద్యులు, ఇతర అధికారులను తిరిగి నియమించి, వారి సహకారం తీసుకోవాలని సూచించింది.
దేశ్యాప్తంగా మే 1 నుంచి ప్రారంభం కానున్నమూడో దశ వ్యాక్సిన్ ప్రక్రియపై కేంద్రాన్ని నిలదీసింది. దేశంలో ఒక వ్యాక్సిన్ కు రెండు ధరలు ఎందుకో చెప్పాలని ప్రశ్నించింది. స్వాతంత్రం నాటి నుంచి అమల్లో ఉన్న జాతీయ టీకా నమూనానే అనుసరించాలని చెప్పింది. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే వ్యాక్సిన్ వేయాలని ఆదేశించింది.
అదేవిధంగా.. పౌరుల ప్రాథమిక హక్కును కాలరాస్తే సహించేది లేదని చెప్పింది సుప్రీం. కరోనా విషయంలో పౌరులు తమ అనుభవాలను సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్ వేదికగా పంచుకోవడం తప్పుడు సమాచారం అని చెప్పలేమని వ్యాఖ్యానించింది. అలాంటి సమాచారాన్ని షేర్ చేసిన వారిని వేధింపులకు గురిచేస్తే.. అది కోర్టు ధిక్కరణ కిందే పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ఈ సందేశం దేశంలోని అన్ని రాష్ట్రాలకు, డీజీపీలకు చేరాలని ఆదేశించింది. కరోనాకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వాలు కప్పి పుచ్చరాదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.