Begin typing your search above and press return to search.
నిజం అనుకునేరు!
By: Tupaki Desk | 8 Oct 2015 10:30 PM GMTనాలుకలో చువ్వ దూయడం.. దవడలో అటువైపు నుంచి ఇటు వైపునకు కత్తి దూయడం.. కనురెప్పలకు సూదులు గుచ్చుకోవడం లాంటి దృశ్యాలను చూసినప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఇంతకంటే భయకరంగా ఒళ్లు జలదరించే ఓ సన్నివేశాన్ని యూట్యూబ్ లో చూసి నెటిజన్లు హతాశులైయ్యారు. అదేంటంటే.. ప్రామిస్ అనే మేకప్ ఆర్టిస్ట్ మూతిని ఎలా కుట్టేసుకోవాలో చూయించే వీడియోను యూ ట్యూబ్ లో పెట్టింది. ఇది ఎందుకంటే.. ఈనెల 31వ తేదీన పాశ్చాత్య దేశాల్లో నిర్వహించే 'హలోవిన్' పార్టీకోసం అంట. ఈ పార్టీలో చిత్ర విచిత్ర వేశాలతో పార్టీ ప్రియులను అలరించాలి.
అందులో భాగంగా ఇలా మూతిని కుట్టేసుకుని ఆ పార్టీలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలవొచ్చనేది ప్రామిస్ ఇలా చేసి చూపించింది. ఈమె అసలు పేరు ప్రతిగ్యా తమంగ్. నేపాల్లో పుట్టి పెరిగిన ఆమె అమెరికాలో నివాసం వుంటోంది. ఈ అమ్మడికి మానవ ఊసరవెల్లిగా ఈ అమ్మడికి బాగా పేరుంది. ఈ అమ్మడికి యూట్యూబ్ లో పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్స్ వున్నారు. దాదాపు నలభై లక్షల మంది ఫ్యాన్స్ వున్నారు. ఆమె చిత్రవిచిత్రమైన ఆన్ లైన్ పాఠాలు చెబుతుంది. తాజాగా మూతిని సూది దారంతో ఎలా కుట్టేసుకోవాలో ఆన్ లైన్ లో ట్యూషన్ చెప్పింది. అయితే ఇంత భయంకరంగా ఆమె మూతిని ఎలా కుట్టేసుకుంది.. ఇదంతా విచిత్రం కాకపోతేనూ అనుకునేరు? అలా భావిస్తే.. మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. ఆమె మూతిని కుట్టేసుకున్నట్టు మీకు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పింది కేవలం కల్పితమే. ఎలాగంటే.. దారాన్ని రెండు పెదవుల అంచులకు అతికించుకుని.. సూది గుచ్చినట్టు ఎర్రని చుక్కలు పెట్టి.. నోటీని కుట్టేసుకున్నట్టు కనిపించింది. హలో వీన్ పార్టీకి వెళ్లే వారు కూడా ఇలా జిమ్మిక్కు చేసి అక్కడ కనువిందు చేయొచ్చని వివరించింది. ఈ వీడియోను యూట్యూబ్ లో ఇప్పటి వరకు 30 లక్షల మంది చూశారట. దీన్ని చూసిన వారంతా.. ప్రామిసా మజాకా అంటున్నారు!