Begin typing your search above and press return to search.

అందమైన భవనాల సృష్టికర్త..పుమిహికో మాకి

By:  Tupaki Desk   |   26 March 2016 4:40 AM GMT
అందమైన భవనాల సృష్టికర్త..పుమిహికో మాకి
X
ఆర్కిటెక్ట్ ప్రపంచానికి సుపరిచితమే కానీ.. సాదాసీదా ప్రజలకు ఏ మాత్రం తెలియని పేరు ఒకటి ఇప్పుడు అందరి నోట్లో నానుతోంది. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే నిర్మాణాలకు సంబంధించి ఎంపికైన నమూనాల్ని తయారు చేసింది జపాన్ కు చెందిన పుమిహికో మాకీ సంస్థ (మాకీ అండ్ అసోసియేట్స్) . ఈ సంస్థ గొప్పతనాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏడు ఖండాల్లో ఎన్నో భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్ట్ చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. ప్రపంచం సంగతి పక్కన పెట్టి.. మన దేశంలో ఈ సంస్థ ఏదైనా కట్టడాన్ని నిర్మించిందా? అన్న ప్రశ్న వేస్తే.. బీహార్ లోని బీహార్ వస్తు ప్రదర్శన శాలకు డిజైన్ చేసి ఇచ్చింది ఈ సంస్థే.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత పేరు ప్రఖ్యాతులున్న మాకీ అండ్ అసోసియేట్స్ సంస్థలో పని చేసే ఉద్యోగుల సంఖ్యను వింటే నోరు వెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలోని పలు ప్రఖ్యాత నిర్మాణాలకు ఆర్కిటెక్ట్ చేసిన ఇచ్చిన ఈ కంపెనీలో పని చేసే ఉద్యోగులు కేవలం 45 మంది మాత్రమే. 1954లో అమెరికాలోని హార్వర్డ్ వర్సటీలో డిజైన్ లో పట్టభద్రుడైన మాకీ కొన్నేళ్లు ఆర్కిటెక్ట్ గా పని చేసి అనంతరం.. జపాన్ కు వెళ్లిపోయారు. 1965లో ఆయన మాకీ అండ్ అసోసియేట్స్ గా కంపెనీని ఏర్పాటు చేశారు. తన సిబ్బందితోపాటు.. నేటికి మాకీ పని చేస్తుండటం విశేషంగా చెప్పొచ్చు.

మాకీ నిర్మించిన భవనాలు.. భారీ కట్టడాలకు సంబంధించి ఇచ్చిన కొన్ని ప్లాన్లు చూస్తే..

= లెబనాన్ లోని బీరూట్ బ్లాక్ నిర్మాణం. 4.82లక్షల చదరపు మీటర్ల నిర్మిత స్థలంలో కార్యాలయం.. వాణిజ్య భవనం

= న్యూయార్క్ లోని 23 లక్షల చదరపు అడుగుల నిర్మిత స్థలంలో ఏర్పాటు చేసిన నాలుగో వరల్డ్ ట్రేడ్ సెంటర్

= 3.29 లక్షల చదరపు అడుగుల నిర్మిత స్థలంలో న్యూయార్క్ లోని అస్టోర్ ప్యాలెస్

= జపాన్ రాజధాని టోక్యోలో 11042 చదరపు మీటర్ల నిర్మిత స్థలంలో రోలెక్స్ టొయోకో భవనం

= జర్మనీలోని మ్యూనిచ్ లో 68,306 చదరపు మీటర్ల నిర్మిత స్థలంలో ఇసార్ బూరో పార్క్

= 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణయంలో నిర్మించే న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి భవనానికి డిజైన్

= జపాన్ రాజదానిలో నిర్మించే (41,510 చదరపు మీటర్ల విస్తీర్ణం) న్యూ మచీడా సిటీ హాల్