Begin typing your search above and press return to search.

మూత్రంతో బీర్ తయారీ.. ఆ టేస్టే వేరంటున్నారు..!

By:  Tupaki Desk   |   27 May 2022 5:30 PM GMT
మూత్రంతో బీర్ తయారీ.. ఆ టేస్టే వేరంటున్నారు..!
X
పని ఒత్తిడిని తగ్గించేందుకు కొందరు మానసికానందం పొందుతారు. ఈ క్రమంలో వ్యసనాలకు అలవాటుపడుతారు. ఇలాంటి వ్యసనాల్లో అల్కహాల్ సేవించడం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ సేవించంది రోజు గడవని వారు ఎంతో మంది ఉన్నారు. ఆల్కహాల్ ను రకరకాల పద్ధతుల్లో తీసుకుంటారు.

కొందరు వైన్ సేవిస్తే.. మరికొందరు బీర్లను తాగుతూ ఉంటారు. సింగపూర్ దేశంలో బీర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. మద్యం ప్రియులకు కొరత లేకుండా కంపెనీలు తమ ఉత్పత్తులను సాగిస్తాయి. ఇటీవల ఆ దేశంలో నీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో మురికినీటిని శుద్ధి చేసిన ఆ నీటితో బీర్లు తయారు చేస్తున్నారు. అయితే శుద్ధి కాకముందు ఈ నీటిలో మూత్రం కూడా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరు మద్యం ప్రియులకు ఈ విషయం తెలియకపోయినా అలా తయారు చేసిన బీర్ ఎంతో టేస్టీగా ఉందంటున్నారు.

సింగపూర్ దేశంలో ఏళ్లుగా నీటి కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్ కు అనుగుణంగా వాటర్ ను అందించేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ దేశానికి చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ తాగేందుకు మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడింది.

అప్పుడప్పుడు వర్షాలు పడిన నీటితో పాటు మలేషియా నుంచి నీటిని తీసుకొని ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. అయితే ఈమధ్య నీటి కొరత తీవ్రంగా ఏర్పడడంతో ‘నీ వాటర్’ ను తయారు చేస్తున్నారు. మురికినీటితో పాటు సముద్రం నీరు కలిసి శుద్ధి చేయడం ద్వారా నీ వాటర్ తయారవుతుంది. దీనిని మంచినీటితో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు.

ఈ ‘నీ వాటర్’ ను ఇప్పుడు బీర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంటే మురికినీటిని శుద్ధి చేయడంతో వచ్చిన నీటిని బీర్ల తయారీకి ఉపయోగిస్తున్నారు. అంటే ఇందులో మూత్రం నీరు కూడా కలుస్తుందని కొందరు అంటున్నారు. బీరులో 90 శాతం నీరే ఉంటుంది. అంటే మూత్రం నీటినీ శుద్ధి చేసి ఆ నీటినే బీర్ల తయారీకి ఉపయోగిస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఇలా నీ వాటర్ తో తయారు చేసిన బీర్లు ఎంతో టేస్టీగా ఉన్నాయని స్థానిక మద్యం ప్రియులు అంటున్నారు. ఈ బీర్ లో మూత్రం నీటితో పాటు జర్మనీ బార్లీ, నార్వే ఈస్ట్ లాంటి పదార్థాలు కలుస్తాయి.

ఈ బీరు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురి కారని స్థానిక అధికారులు చెబుతున్నారు. మరోవైపు చాలా మందికి ఈ బీరులో మూత్రం వాటర్ కలుస్తుందని తెలియదు. కొన్ని మీడియా సంస్థలు ఈ బీర్లలో మూత్రం నీరు కలుస్తుందని మీకు తెలుసా..? అని చెప్పగానే ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలా మురికినీటిని శుద్ధి చేయడంతో ద్వారా నీటి అవసరాలను తీర్చుకోవచ్చని సింగపూర్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మరి కొన్ని దేశాల్లో ఇలా నీటికొరత ఏర్పడింది. మరి ఆ దేశాలు సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుంటాయా..? చూడాలి..