Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా లో రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తే జైలు కే ?

By:  Tupaki Desk   |   9 Nov 2019 5:09 AM GMT
సోషల్ మీడియా లో రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తే జైలు కే ?
X
సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించే స్థాయి కి చేరింది. ఏ విషయంలో అయిన , తమ తమ అభి ప్రాయాలని ఈ సోషల్ మీడియా ద్వారానే పంచుకోవడం ఈ మద్యే కొంచెం ఎక్కువై పోయింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా లో పెట్టి ..ఆ విషయాన్ని పెద్దది చేస్తున్నారు. ఈ తరుణం లో మరికొద్దిసేపట్లో గత కొన్ని శతాబ్దాలు గా చిక్కు వీడకుండా ఉన్న అయోధ్య లో రామ మందిర నిర్మాణం పై సుప్రీం కోర్టు తుది తీర్పుని వెల్లడించనుంది.

అయోధ్య వివాదాస్పద భూమి కేసు లో తుదితీర్పును శనివారం వెల్లడించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ కి అత్యంత చేరువలో ఉన్న పారిశ్రామిక, వాణిజ్య నగరం నోయిడా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర్పు వెల్లడి కి ముందు గాని, తర్వాత గానీ వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌తో సహా ఏ సోషల్‌ మీడియా మాధ్యమం ద్వారా నైనా హింసను ప్రేరేపించేలా, మత విద్వేషాలను రగిలించేలా, విద్వేష పూరిత పోస్టింగ్స్ వేస్తే గ్యాంగ్‌ స్టర్ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ వీఎన్ సింగ్ తెలిపారు.

సర్వోన్నత న్యాయ స్థానం వెలువరించనున్న తీర్పు పై ఎలాంటి ఊహాగానాలూ చేయరాదని, తీర్పు ఎలా ఉన్నప్పటి కీ ప్రజలు సంయమనం కోల్పోరాదని, అన్ని వర్గాలవారూ సామరస్యంతో మెలగాలని ఆ ప్రకటనలో జిల్లా మేజిస్ట్రేట్ సూచించారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలు కూడా ఇదే విధమైన ఆదేశాలను తమ తమ పరిధులలో జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్‌ లోని గౌతమబుద్ధనగర్ జిల్లాలో ఉన్న నోయిడా నగరం మన దేశంలోని అతిపెద్ద వాణిజ్య, పారిశ్రామిక నగరాల్లో కీలకమైనది. మన దేశ రాజధాని న్యూఢిల్లీకి అత్యంత చేరువలో ఉంది. శాటిలైట్ సిటీగా, నేషనల్ క్యాపిటల్ రీజన్‌లో భాగంగానూ ఉన్న నోయిడా నగరంలో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థల జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యాలయాలున్నాయి.

అయోధ్య వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు శనివారం వెలువడనుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే బలగాలని మోహరించి ఎటువంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా అయోధ్య పట్టణం ఉన్న ఉత్తరప్రదేశ్‌ లో మరింత అప్రమత్త పరిస్థితి నెలకొంది. అలాగే తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ..అందరూ ఆ తీర్పుని స్వాగతించాలి అని దేశ ప్రధాని మోడీ దేశ ప్రజలకి పిలుపునిచ్చారు.