Begin typing your search above and press return to search.
మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడం పై నిషేధం తొలగింపు..
By: Tupaki Desk | 7 Aug 2022 8:30 AM GMTకరోనా మహమ్మారి మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది. కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో కొన్నింటిని ముట్టుకోవడం పై నిషేధం విధించారు. మహమ్మారి కాస్త తగ్గి పోయాక ఆ నిషేధాలు ఎత్తివేశారు. తర్వాత జనం తమ సాధారణ లైఫ్ స్టైల్ కి మళ్లీ అలవాటు పడిపోయారు. కానీ కొన్ని చోట్ల.. కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా ప్రజలు తమ భయం వీడటం లేదు. అలాంటి ఓ సంఘటన గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే..
సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లే సందర్శకులు కాబా గృహానికి ఉన్న నల్లని రాయిని తాకి ముద్దు పెట్టుకోవచ్చు. కరోనా మహమ్మారి వల్ల కాబాను తాకేందుకు విధించిన నిషేధాన్ని ప్రస్తుతం తొలగించారు. ఈ నిషేధం తొలగించిన తర్వాత భక్తులు ఉత్సాహంతో ఈ నల్లని రాయిని తాకి ప్రార్థనలు చేయడం కనిపిస్తోంది. 30 నెలల తర్వాత ఈ నిషేధాన్ని తొలగించారు. ఉమ్రా యాత్ర మొదలు కావడానికి ముందు ఈ చర్యను అమలు చేశారు. ఉమ్రా సమయంలో మతపరమైన చాలా రకాల ఆచారాలు నిర్వహిస్తారు. ఉమ్రా కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ముస్లింలు మక్కా సందర్శిస్తారు. చాలా మంది మక్కాకు దగ్గర్లో ఉన్న మదీనాకు కూడా వెళతారు.
సౌదీ అరేబియా కరోనా మహమ్మారి వల్ల విధించిన చాలా రకాల నిబంధనలు ఈ ఏడాది సడలించింది. ఈ ఏడాది జూలై 7 నుంచి 13 మధ్యలో హజ్ యాత్ర చోటు చేసుకుంది. ఈ యాత్రకు వెళ్లిన భక్తుల సంఖ్య సాధారణ రీతిలోనే నమోదయింది. 2020లో కేవలం 1000 మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి లభించింది. ఆ ఏడాది కేవలం సౌదీ అరేబియాకు చెందిన వారికి మాత్రమే హజ్ యాత్రకు అవకాశం దక్కింది. ఇతర దేశాల వారికి హజ్ యాత్ర పై నిషేధం విధించారు. 2021లో భక్తుల సంఖ్య 60,000కు పెరగగా ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది మక్కా సందర్శించి హజ్ యాత్ర చేశారు. అయితే, కరోనా ముందు మక్కాకు వెళ్లే సందర్శకులతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. 2019లో 25 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్లినట్లు స్టాస్టిక వెబ్ సైటు పేర్కొంది.
కాబా గృహంలో ఈశాన్యం మూలలో పెట్టిన రాయి (బ్లాక్ స్టోన్)ని ఇస్లాంలో నల్లని రాయి అని అంటారు. దీనిని అరబిక్ భాషలో అల్- హజర్-అల్- అస్వద్ అని అంటారు. కాబాను సందర్శించిన భక్తుల్లో కొందరు ఈ పవిత్ర రాయిని తాకుతారు, మరికొందరు ముద్దు పెట్టుకుంటారు. ఈ రాయి ఆదాము (ఆడమ్), హవ్వా (ఈవ్) కాలానికి చెందినవని నమ్ముతారు. భూమిపై పుట్టిన తొలి మానవులు వీళ్లేనని భావిస్తారు. ఇస్లాం ఆవిర్భావానికి ముందు నుంచే ఈ రాయిని పవిత్రంగా భావించేవారు. ఈ రాయి మొదట్లో తెల్లని వర్ణంలో ఉండేదని, కానీ, తనను తాకిన భక్తుల పాపాల భారాన్ని మోస్తూ ఈ రాయి నల్లగా అయిందని అంటారు.
మక్కాకు వెళ్లిన తర్వాత ముస్లింలు మస్జీద్ అల్ - హరామ్‌కు వెళ్లి ఏడు సార్లు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి అల్లాను ప్రార్థిస్తారు. కాబా సందర్శన తర్వాత ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లే సందర్శకులు మదీనాకు కూడా వెళతారు. ఇది మక్కాకు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదీనాలో మస్జీద్-ఈ-నబ్వీ ఉంది. ఇక్కడ భక్తులు ప్రార్ధనలు నిర్వహిస్తారు. మదీనాకు ప్రయాణం చేయడం హజ్‌లో ముఖ్యమైన భాగం కాదు. కానీ, మహమ్మద్ ప్రవక్త ఈ మసీదును కూడా నిర్మించారు. దీంతో, ముస్లింలందరూ కాబా తర్వాత మదీనాను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సమాధి కూడా ఉంది. హజ్ యాత్రకు వెళ్లే వారు ఈ సమాధి ని కూడా సందర్శిస్తారు.