Begin typing your search above and press return to search.
ఏపీకి మందకృష్ణ బద్ధ శత్రువా...!
By: Tupaki Desk | 24 July 2019 1:10 PM GMTఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీరుపై ఎస్సీల్లోనే రోజురోజుకు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యమ నేత గా ఉన్నప్పుడు మందకృష్ణకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో పేరు ఉండేది. అలాంటి నేత ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచే ఆయనపై విమర్శలు ఎక్కువ అవుతూ వచ్చాయి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఫైట్ చేస్తున్న మందకృష్ణ ఆ ట్రాక్ తప్పారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాల మహానాడు - ఎంఆర్పీఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోన్న మందకృష్ణ అక్కడ టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు.
ఇక కొద్ది రోజులుగా ఆయన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి దగ్గరవుతున్నారు. ఇక ఏపీలోనూ ఇదే అంశంపై ముందుగా చంద్రబాబుకు దగ్గరై ఆ తర్వాత ఆయన్ను విమర్శించిన మంద కృష్ణ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. దీని ఆధారంగానే జగన్ మోహన్ రెడ్డి మాట్టాడారు. దీనిపై సైతం ఆయన విమర్శలు చేయడంతో ఆయన మాలలతో పాటు సొంత సామాజికవర్గం నేతల నుంచి కూడా విమర్శలకు గురవుతున్నారు.
మందకృష్ణపై తాజాగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేసి ఆయన పబ్బం గుడపు కోవాలని చూస్తున్నాడని... ఏపీకి మంద కృష్ణ బద్ధ శత్రువు అని విరుచుకుపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న మాదిగ - మాలల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని మరో నేత గుమ్మపు సూర్యప్రసాద్ మండిపడ్డారు.
ఇక ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కూడా మందకృష్ణను టార్గెట్ గా చేసుకున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై వర్గీకరణకు సంబంధించి ఎలాంటి ? చర్చలు జరపకుండా ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం దారుణమన్నారు. మందకృష్ణ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కాదని.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసేందుకే అని వెంకటేశ్వరరావు మండిపడ్డారు.