Begin typing your search above and press return to search.
ఆమె మహిళా లోకం కు ఆదర్శం
By: Tupaki Desk | 9 Jan 2022 3:30 PM GMTతండ్రి మాజీ ముఖ్యమంత్రి. భర్త ప్రముఖ పారిశ్రామికవేత్త. కానీ నాడు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. కంటికి రెప్పలా చూసుకునే తండ్రి, లెక్కలేనంత ప్రేమను పంచే భర్త. కానీ కొన్ని రోజుల తరువాత ఆమె జీవితం తలకిందులు అయ్యింది. వ్యాపారంలో నష్టాలతో భర్త అనుకోని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకవైపు సంస్థ, మరో వైపు భర్త దూరం అయ్యారు అనే బాధ. కానీ ఆమె వెనకడుగు వేయలేదు.
సంస్థ అప్పును అణాపైసాతో పాటు చెల్లిస్తానని చెప్పింది. ఉద్యోగుల భవిష్యత్తుకు తాను బాసటగా నిలుస్తాను ధైర్యం చెప్పింది. కష్టాల కడలిని గట్టెక్కాలనే లక్ష్యంతో భర్త స్థానంలో పగ్గాలు చేపట్టి ఏడాది తిరిగే లోపే సంస్థ అప్పులను సగం మేర కట్టేసింది. ఉద్యోగుల్లో రెట్టింపు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి ముందుకు సాగింది. ఆమె కర్ణాటకకు చెందిన మాళవిక హెగ్దే. సంస్థ పేరే కాఫీ డే.
మాళవిక హెగ్దే భర్త వీజే సిద్ధార్థ. ఆయన సంస్థ భారీ అప్పుల్లో మునగడంతో సంస్థను చూసుకోవాల్సి భారం ఆమె పై పడింది. భర్త మరణం ఓ వైపు తనని వేధిస్తున్నా.. సంస్థ ఉద్యోగుల కోసం ముందడుగు వేసింది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్కు తాను ఉన్నాని ఉద్యోగులకు ధైర్యం చెప్పింది. చుట్టుముట్టిన అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు నిరంతరం కృషి చేసింది.
ఈ క్రమంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టినా కానీ ఎదురు నిలబడి నిలిచింది. సుమారు 7 వేల కోట్ల రూపాయల అప్పు క్రమక్రమంగా తీర్చింది. వాస్తవానికి ఆ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా కానీ భర్త చేసిన అప్పుతో తనకు ఏం సంబంధం అని విదేశాలకు జంప్ కావచ్చు. కానీ ఆమె మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. అలా చేస్తే తన భర్త పేరు చెడిపోతుందని భావించింది. మరో వైపు సంస్థనే నమ్ముకున్న వేలాది కుటుంబాలను ఆదుకోవాలని అనుకుని తిరిగి కంపెనీ నిలబెట్టింది.
సంస్థకు ఉన్న అప్పులో సుమారు అంటే మూడు వేల ఒక వంద కోట్లు ఇవ్వాలని వారికి చెల్లించింది. సంస్థను నమ్మిన మదుపరులకు కూడా భరోసా ఇచ్చింది. ఉద్యోగులకు విశ్వాసాన్ని నింపి ఉన్నత శిఖారాల వైపు అడుగులు వేసేలా చేసింది మాళవిక హెగ్దే. సంస్థ భవిష్యత్ ప్రణాళికలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని.. త్వరలోనే అన్నింటిని అధిగమించి.. అనుకున్నది సాధిస్తామని ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. కష్టకాలంలో తమను నమ్మి, వెన్నంటి నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపింది.