Begin typing your search above and press return to search.

దిమ్మ‌తిరిగే షాకిచ్చిన భార‌త్‌..కాకాప‌డుతున్న మ‌లేషియా

By:  Tupaki Desk   |   23 Jan 2020 12:40 PM GMT
దిమ్మ‌తిరిగే షాకిచ్చిన భార‌త్‌..కాకాప‌డుతున్న మ‌లేషియా
X
త‌న‌కు సంబంధం లేని విష‌యంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో...మ‌లేషియాకు తెలిసివ‌చ్చింది. కేవ‌లం మతం కోణంలో...భార‌త్‌ ను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ దేశానికి ఓ రేంజ్‌ లో అర్థ‌మైంది. భార‌త్‌కు షాకిచ్చిన‌ట్లు ఫీల‌యిన ఆ దేశం ఇప్పుడు కాకా ప‌డుతోంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు - కశ్మీరుపై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను భారత్ ఈ నెలలో నిలిపివేసింది. దీంతో పామాయిల్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేసుకున్న భారతదేశంపై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ వాపోయారు. అయితే, కాకాప‌ట్టే ప్ర‌య‌త్నంలో భాగంగా మ‌న‌దేశం నుంచి పంచ‌దార ఎక్కువ‌గా కొనుగోలు చేసి ఐస్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అక్టోబరులో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మహతీర్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నారు. కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని భారత్‌ పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కశ్మీర్‌ అంశంపై దాయాది దేశం పాకిస్థాన్‌ కు అనుకూలమైన రీతిలో వ్యవహరిస్తున్న మలేషియా నుంచి పామాయిల్‌ కొనుగోలు చేయకూడదని సాల్వెంట్‌ ఎక్స్‌ ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌ ఈఏఐ) నిర్ణయించింది. ఇండోనేషియా తర్వాత అతిపెద్ద పాయాయిల్‌ ఉత్పత్తిదారుగా దేశంగా మలేషియా ఉంది. గత ఐదేళ్లుగా భారత్‌ మలేషియా నుంచి పామాయిల్‌ ను దిగుమతి చేసుకుంది. హ‌ఠాత్తుగా ఆపేసిన నేప‌థ్యంలో... మ‌లేషియా ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్రంగా ప్ర‌భావితం అయింది. ఈ నేపథ్యంలో మ‌లేషియా ప్ర‌ధాని స్పందిస్తూ ‘మేం చాలా చిన్నవాళ్లం. భారత్‌ నిర్ణయాన్ని ప్రతిఘటించలేము. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ప్ర‌స్తావించ‌డ‌మే కాకుండా..అమ‌ల్లో కూడా పెట్టారు ఆ దేశ ప్ర‌ధాని. అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు అయిన భార‌త‌దేశాన్ని కాక‌ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. భార‌త‌దేశం నుంచి చక్కెర కొనుగోళ్లు పెంచాలని భావించి త‌మ దేశానికి చెందిన - ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తి సంస్థ ఎఫ్‌ జీవీ హోల్డింగ్స్‌ కు చెందిన ఎంఎస్ ఎం మలేషియా హోల్డింగ్స్ ద్వారా భారత్ నుంచి 49.20 మిలియన్ డాలర్ల విలువైన 1,30,000 టన్నుల ముడి చక్కెరను కొనుగోలు చేయనున్నట్లు ప్ర‌కటింప చేసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంటే జనవరి-మార్చిలో ఈ మేర‌కు కొనుగోలు చేయ‌నుంది. వివాదాన్ని సామరస్యంగా లేదా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పరిష్కరించుకునేందుకు మలేషియా సిద్ధపడి చ‌క్కెర‌ను ఈ నేప‌థ్యంలో పామాయిల్ విషయంలో భారత్ ఏం చేస్తుందో చూడాల‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.