Begin typing your search above and press return to search.

విమానం చూసి పెర్త్ వాసులు నోళ్లు వెళ్లబెట్టారు!

By:  Tupaki Desk   |   12 Aug 2016 7:26 AM GMT
విమానం చూసి పెర్త్ వాసులు నోళ్లు వెళ్లబెట్టారు!
X
చిన్నప్పుడు ఊర్లలో ఉండేవారికి ఆకాశంలో పెద్ద సౌండ్ చేసుకుంటూ కనిపించీ కనిపించనట్లు వెళ్లే విమానాన్ని చూడటం అంతే ఎంతో సరదా! అ విమానం కనిపించనంతదూరం వెళ్లేవరకూ అలా తల పైకెత్తి, నోరెళ్లబెట్టి చూస్తూ ఉన్న అనుభవం అందరికీ తెలిసిందే! ఊర్ల పైనుండి అస్తమానం విమానాలు వెళ్లవు కాబట్టి అక్కడి జనం - అందులోనూ చిన్నపిల్లలు చూస్తూ ఉండిపోయారంటే సరేలే అనుకోవచ్చు. మరి ప్రప్రంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన ఆస్ట్రేలియా వాసులు కూడా నోళ్లు వెళ్లబెట్టి, ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూస్తూ ఉండిపోయారంటే ఏమనుకోవాలి? అవును ఇది అక్షరాలా నిజం.. ఆస్ట్రేలియా వాసులు ఒక విమానాన్ని అదేపనిగా చూస్తూ ఆశ్చర్యానికి, ఆనందానికీ గురైయ్యారు!

ఆస్ట్రేలియా వాసులు ఆకాశంలో ఎగురుతూ వచ్చి - పెర్త్ విమానాశ్రయంలో దిగిన "గోల్డ్ జెట్" ను చూసి ఆశ్చర్యపోయారు. విమానమేమిటి - బంగారంతో చేయడమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే విషయంలోకి వెళ్లాల్సిందే. గురువారం నాడు పెర్త్ విమానాశ్రయంలో ఒక బంగారపు ప్రైవేట్ విమానం వచ్చి ఆగింది. ఈ విమానం మలేసియాలోని జొహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ ది! ఆ సుల్తాన్ తన భార్య రాజా జారీత్ సోఫియాతో కలిసి పశ్చిమ ఆస్ట్రేలియాలో హాలిడే ఎంజాయ్ చేద్దామని ఆ పసిడి విమానంలో ఇక్కడికి వచ్చారు. దీంతో ఈ విమానం చూసిన ఆస్ట్రేలియా వాసులు ఆ పసిడి విమానాన్ని అదేపనిగా చూస్తూ ఉండిపోయారట.

ఈ బంగారపు విమానం ఖరీదు 100 మిలియన్ డాలర్లు, అంటే.. సుమారు 668 కోట్ల రూపాయలు! బోయింగ్ 737 చెందిన ఈ విమానంలో ఎంతో విలాసవంతమైన సదుపాయాలున్నాయి. ఒక డైనింగ్ రూము - ఒక బెడ్ రూము - మూడు వంట గదులు - షవర్ లు ఈ విమానంలో ఉన్నాయి. సుల్తాన్ తన అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయించుకున్నాడు. ఈ విమానాన్ని సుల్తాన్ టెస్ట్ కి తగినట్లు తయారుచేయడానికి సుమారు రెండేళ్లు పట్టింది. బంగారు విమానాన్ని తయారు చేయించుకున్నాడు.. ఈ సుల్తాన్ గారి మొత్తం ఆస్తి ఎంత ఉంటుందా అని అనుకుంటున్నారా... ఆయన మొత్తం సంపద దాదాపు రూ.6,680 కోట్లు.