Begin typing your search above and press return to search.

ఓఐసీకి మాల్దీవులు షాక్.. భారత్ కు మద్దతు

By:  Tupaki Desk   |   23 May 2020 12:30 PM GMT
ఓఐసీకి మాల్దీవులు షాక్.. భారత్ కు మద్దతు
X
భారత కు పశ్చిమాన హిందూ మహా సముద్రంలో వ్యూహాత్మకంగా ‘మాల్దీవులు’ దేశం ఉంటుంది. తాజాగా ఈ దేశం భారత్ కు అనూహ్య మద్దతు పలికింది. చైనా కనుసన్నల్లో భారత చుట్టుపక్కల దేశాలన్ని ఉంటే.. మాల్దీవులు మాత్రం భారత్ వైపు నిలబడడం ప్రత్యర్థులకు షాకింగ్ గా మారింది.

భారత్ పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తీసుకునే ఏ చర్యలకు తాము మద్దతు ఇవ్వబోమని హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం ‘మాల్దీవులు’ స్పష్టం చేసింది. ఇస్లామోఫోబియోతో భారత్ ను ఒంటరిని చేయాలని ఓఐసీ చూస్తోంది. ముస్లిం ప్రపంచ గొంతుగా అభివర్ణించుకునే ఓఐసీ.. జమ్మూకాశ్మీర్ సహా భారత్ లోని ముస్లింలపై వివక్షపై వ్యతిరేకంగా పోరాడుతోంది.

తాజాగా ఓఐసీకి మాల్దీవులు షాక్ ఇచ్చింది. ముస్లిం దేశమైన మాల్దీవులు భారత్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం విశేషం. విభిన్న సంస్కృతులు, బహుళ సమాజాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని.. ఓఐసీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాల్దీవులు విమర్శించింది. శతాబ్ధాలుగా భారత్ లో ఇస్లాం ఉందని.. ఓఐసీ భారత్ లోని ముస్లింల భావాలకు ప్రతినిధిగా భావించమని స్పష్టం చేసింది. భారత్ ను లక్ష్యంగా చేసుకొని ఓఐసీ తీసుకునే చర్యలకు తాము మద్దతు ఇవ్వమని పేర్కొంది.

మొత్తం 57 ముస్లిం దేశాలు సభ్యులున్న ఓఐసీ భారతదేశాన్ని తీవ్రంగా ఇటీవల విమర్శించింది. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించగా.. మాల్దీవులు మద్దతు తెలిపింది.